`రెమెడిసివ‌ర్‌`పైనా మోడీ ఆధిప‌త్యం?!

Update: 2021-05-08 09:30 GMT
దేశంలో క‌రోనా కోర‌లు చాస్తున్న విష‌యం తెలిసిందే. రోజుకు వేలలో ప్ర‌జ‌లు చ‌నిపోతున్నారు. గంట‌కు 150 మంది చొప్పున మ‌ర‌ణించిన‌ట్టు గ‌త వారం రోజుల్లో మృతి చెందిన వారి లెక్క‌ల‌ను బ‌ట్టి నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో 4170 మంది దేశంలో క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఇది అధికారిక అంచ‌నా మాత్ర‌మే. కానీ, అన‌ధికార లెక్క ప్ర‌కారం.. ఈ సంఖ్య రెండు రెట్లు ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి క‌రోనా బాధితుల ప్రాణాల‌కు అడ్డుప‌డే ఔష‌ధాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎలా వ్య‌వ‌హ‌రిస్తోంది? అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో త‌ల‌తోక లేని నిర్ణ‌యాలు తీసుకుంద‌నే విమ‌ర్శ‌లు.. మోడీ ప్ర‌భుత్వా నికి భారీ సెగ‌పుట్టిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. మోడీ స‌ర్కారు మాత్రం మార‌డం లేదు. వ్యాక్సిన్ విష‌యంలో నిర్ణ‌యాన్ని రాష్ట్రానికే వ‌దిలేసిన కేంద్రం.. మీరే కొనుక్కోవాల‌ని తేల్చి చెప్పింది. పోనీ.. కొనుక్కుందామ‌ని అనుకున్నా.. రాష్ట్రాల‌కు ఇంత‌కు మించి ఇవ్వ‌లేం అంటూ.. లెక్క‌లు చెబుతోంది. అదేస‌మ‌యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు జోరుగా డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల‌కు చాలా త‌క్కువ సంఖ్య‌లో డోసులు కేటాయిస్తోంద‌ని ప్ర‌భుత్వాలు విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి.

అయినా.. మోడీ స‌ర్కారులో ఎలాంటి మార్పు రావ‌డం లేదు. వ్యాక్సిన్‌పై మోడీ ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్నా ర‌నే వ్యాఖ్య‌లు ఉన్నాయి.  ఇక‌, ఇప్పుడు తాజాగా రెమెడిసివ‌ర్‌పై మోడీ స‌ర్కారు ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేలా ఆదేశాలు జారీ చేశారు. కరోనా నియంత్రణకు ఉపయోగించే  అత్యంత కీల‌క‌మైన రెమ్‌డెసివిర్‌ ఔషధ సరఫరా విషయంలో ఏయే రాష్ట్రాలకు ఎంత మోతాదు సరఫరా చేయాలో వివరిస్తూ.. మోడీ స‌ర్కారు సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

ఈ మేరకు రాష్ట్రాలవారి జాబితానూ పంపింది కేంద్రం. రెమ్డెసివిర్ ఔషధ సంస్థలతో చర్చించాకే తన నిర్ణయాన్ని వెలువరించిన‌ట్టు తెలిపింది. అంటే.. తాము చెప్పిన మేర‌కు మాత్ర‌మే రాష్ట్రాల‌కు రెమ్‌డెసివ‌ర్‌ను పంపిణీ చేయాల‌ని.. రాష్ట్రాలు కోరిన‌న్ని కాద‌ని.. మోడీ ప‌రోక్షంగా ఆధిప‌త్యం చ‌లాయించేశారు. అంతేకాదు..  ఈ నెల 16 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇక‌, దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే డోసుల వివరాలు..
జైడస్‌ క్యాడిలా - 9,82,100
హెటిరో - 17,17,050
మైలాన్‌ - 7,28,000
సిప్లా - 7,32,300 డోసులు
షిన్జిన్‌/సన్‌ - 3,73,000
జుబిలియంట్‌ - 4,45,700
డాక్టర్‌ రెడ్డీస్‌ - 3,21,850
Tags:    

Similar News