ప్రధాని మోదీ అత్యవసర సమావేశం .. ఈ అంశమే ప్రధాన అజెండా!

Update: 2021-11-27 07:22 GMT
దేశంలో మరో రకం కరోనా మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది అన్న వార్తలు వెలువడుతున్న సమయంలో మోడీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై అత్యవరసరంగా సమావేశం నిర్వహించారు. అయితే కరోనా థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సౌతాఫ్రికా వేరియంట్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా కంటే ఈ న్యూ వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీంతో పాటు దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నమోదైన సరికొత్త, ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఈ వేరియంట్ పై ఇప్పటికే వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో ప్రకంపనలు సృష్టించడంతో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రినింగ్‌, పరీక్షలను కఠినతరం చేయాలని భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరింది. ప్రధాని నిర్వహించిన అత్యవసర సమావేశంలో క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌, నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ పాల్గొన్నారు. ఇక ఈ సమావేశం లో టీకా డ్రైవ్‌ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రతి ఒక్కరు టీకా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫస్ట్‌ డోస్‌, సెకండ్‌ డోస్‌ పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారో వివరాలు తెలుసుకున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

అయితే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కరోనా వ్యాప్తిపై మోడీ ఆరా తీశారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులను ఆదేశించారు. అయితే కొత్త వేరియంట్‌ B.1.1.1.529 గురించి పరిశీలించాలని, దేశంలో కూడా వ్యాప్తి చెందే అవకాశాలుండటంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే అంతర్జాతీయ పర్యాణికులందరి నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ పై ఆరోగ్య మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగం ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనది కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు.

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లతో సమావేశం కాబోతున్నానని చెప్పారు.
Tags:    

Similar News