దేశ ప్రధానులు విదేశీ పర్యటనలు చేయడం సహజమే. అయితే.. ఈ సందర్భంగా ఆచి తూచి ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. అసలు విదేశీ పర్యటనలను తగ్గించుకున్నవారు కూడా ఉన్నారు. ఎలా చూసుకున్నా దేశ ప్రధానుల ఫారిన్ టూర్లు పెద్దగా గతంలో చర్చకు వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు మోడీ ప్రధానిగా చేస్తున్న ఖర్చులు భారీ ఎత్తున ఉన్నాయనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో అవి ప్రజల మధ్య చర్చకు వస్తున్నాయి.
తాజాగా ఇదే విషయంపై పార్లమెంటులో చర్చ వచ్చింది. ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు చెప్పాలంటూ.. సభ్యులు ప్రశ్నించడంతో కేంద్రం ఆయా వివరాలను వెల్లడించింది. మోడీ విదేశీ పర్యటనల కోసం గత ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర వెల్లడించింది. అత్యధిక ఖర్చు అమెరికా పర్యటనకు కాగా.. అత్యల్పంగా జపాన్ పర్యటనకు అయినట్లు తెలిపింది.
వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను మరింత విస్తరించడమే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల లక్ష్యమని కేంద్రం వివరించింది. దేశ ప్రయోజనాలతోపాటు విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ముఖ్యమని పేర్కొంది.
మోడీ ఫారిన్ ఖర్చు ఇదీ..
+ ఐదేళ్లలో మొత్తం 36 విదేశీ పర్యటనలు
+ 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు
+ నవంబర్ 2017లో ప్రధాని మోడీ ఫిలిప్పైన్స్ పర్యటన
+ 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీ పర్యటనలు
+ ఇప్పటివరకు రూ.239 కోట్లు ఖర్చు
+ అమెరికా పర్యటన కోసం రూ.23 కోట్లు ఖర్చు
+ ఏడాది జపాన్ లో 2 రోజుల పర్యటనకు రూ.23 లక్షలు ఖర్చు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.