కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి మాటా వినని సీతయ్యలా వ్యవహరించే మోడీ సైతం వెనక్కి తగ్గుతున్నారు. దేశ రాజధాని ఆగమాగమైపోయినప్పటికీ వ్యవసాయ చట్టాల విషయంలో వెనకడుగు వేసేందుకు ససేమిరా అన్న ఆయన.. కరోనా విషయంలో మాత్రం వడివడిగా వెనక్కి తగ్గుతున్నారు. తాను తీసుకున్న నిర్ణయాల్ని మార్చుకుంటున్నారు.
అయితే.. ఇదంతా వ్యాక్సిన్ విషయంలోనే కావటం విశేషం. వారం క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్లు వ్యాక్సినేషన్ మీద విమర్శల్ని సంధించటం.. పాతికేళ్లకు పైన ఉన్న వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సర్వత్రా మద్దతు లభించింది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం అనుసరించిన వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా వేసేందుకు ఓకే అంటున్న కేంద్రం.. తాజా పరిణామాల నేపథ్యంలో కాస్త తగ్గి.. సోనియాగాంధీ డిమాండ్ చేసిన పాతికేళ్లను మరింత తగ్గించి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకా ఇవ్వాలన్న పాలసీ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ఊహించని నిర్ణయాన్ని వెల్లడించింది రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయాలన్న మెలికి పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనంతగా మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ జరిగింది. ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ నినదించే మోడీ ప్రభుత్వం.. తన తీరుకు భిన్నంగా ఒకే దేశం.. ఒకే టీకా అనే మాట ఎందుకు అని చెప్పటం లేదన్న ప్రశ్న పెద్ద ఎత్తున రావటం.. దీనిపై కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది.
ఇది సరిపోనట్లు.. ఇప్పటివరకు మోడీకి దన్నుగా వాదనలు వినిపించిన వారంతా మొదటిసారి దుమ్మెత్తిపోయటం.. సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చుట్టుముట్టాయి. ఇలా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్ని షురూ చేసింది మోడీ సర్కారు. తాజాగా వ్యాక్సిన్ పాలసీ మీద కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా టీకాల్ని ఉచితంగా సరఫరా చేయనున్నట్లుగా ప్రకటించారు. దీంతో.. ఒకే దేశంలో రాష్ట్రాల విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న వివక్షపై జరిగే చర్చకు పుల్ స్టాప్ పెట్టినట్లైంది. మొత్తంగా.. టీకా విషయంలో మోడీ రెండుసార్లు వెనక్కి తగ్గటం చూస్తే.. సీతయ్య లాంటి మోడీని కరోనా తగ్గేలా చేసిందని చెప్పాలి.