ప్రధాని నరేంద్రమోడీ మీడియాను తన గుప్పిట పట్టుకుని తాను తలచినట్లుగా ఆడించడంలో సిద్ధహస్తుడు. కేవలం తనకు అనుకూల ప్రచారం సృష్టించుకోవడంలో మాత్రమే కాదు.. తన ప్రత్యర్థుల మీద తాను తలచిన రీతిలో బురదచల్లేలా చేయడంలో కూడా ఆయన స్టయిలే వేరు. లేకపోతే.. తన అహంకారం గురించి లోకమంతా కోడై కూస్తో ఉంటే... ఆయన మాత్రం – కాంగ్రెస్ పార్టీ నెగ్గితే తాను ప్రధాని రేసులో ఉంటాను అని వ్యాఖ్యానించినందుకు రాహుల్ ను అహంకారిగా అభివర్ణించడం చిత్రం కాక మరేమిటి? అని జనం విస్తుపోతున్నారు.
2019 ఎన్నికల్లో రాహుల్ తాను ప్రధాని కాగలను అని చెప్పారే అనుకుందాం.. అందులో తప్పేంటో జనానికి అర్థం కావడం లేదు గానీ.. ఆ మాటల్లో అతి భయంకరమైన అహంకారం దాగి ఉన్నట్లుగా మోడీకి మాత్రం కనిపించింది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో చివరి అంకానికి వచ్చేసరికి... ఆయన కాంగ్రెస్ ను విమర్శించడానికి తన వద్ద అస్త్రాలన్నీ అయిపోయినట్లుగా రాహుల్ గాంధీ కోరిక గురించి బయటపెట్టారు. అదేదో పెద్ద నేరం ఘోరం అయినట్లుగా మోడీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరా కుటుంబం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ పార్టీ మనుగడ సాగించాలంటే.. వారి పేరు చెప్పుకోవాల్సిందే. కాబట్టి అనివార్యంగా వారు... రాహులే వారి పార్టీ తరఫున ప్రధాని అని వారు చాటుకుంటూ ఉంటారు. రాహుల్ వారి మనసులోని మాటనే తన మాటగా చెప్పారు. దానిని అహంకారంగా మోడీ ఎందుకు భావించి ఉడుక్కుంటున్నారో అర్థం కావడం లేదు.
యడ్యూరప్ప లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నాడని మోడీ ప్రకటిస్తే తప్పు లేదు. అదే కర్నాటక రాష్ట్రంలో భాజపాకు కూడా ఎంతో మంది సీనియర్లున్నారు. వారిని తోసివేసి.. అవినీతికి పెద్దపీట వేస్తే తప్పులేదు. కానీ.. రాహుల్ తాను ప్రధాని రేసులో ఉంటే తప్పని మోడీ భావించడం చిత్రమే. అలాగే.. అద్వానీ మురళీమనోహర్ జోషి - జశ్వంత్ సింగ్ - యశ్వంత్ సిన్హా - అరుణ్ శౌరి - శతృఘ్నసిన్హా లాంటి ఎందరు భాజపా సీనియర్లను దారుణంగా తొక్కేస్తూ.. వారి ప్రతిభను - నిజాయితీని - సీనియారిటీని అణగదొక్కేస్తూ తాను ప్రధాని కుర్చీ మీదకు ఎక్కివచ్చిన మోడీ.. అదే కోరికను రాహుల్ చెబితే మాత్రం సీనియర్లను పట్టించుకోని అహంకారపూరిత వ్యాఖ్యలుగా వెక్కిరించడం.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాంటి సామెత తీరు లా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.