గత కొద్దిరోజులుగా హాట్ హాట్ గా సాగుతున్న లోక్ సభ సమావేశాల్లో అధికార.. విపక్ష సభ్యులు చేసిన విమర్శలు.. ప్రతివిమర్శలకు.. సభలో సాగిన చర్చలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పే సమయంలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రశాంత వదనంతో.. ఒకటి తర్వాత ఒకటిగా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తున్న ప్రధాని.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ విపక్షాల నోట మాట రాకుండా చేస్తున్న పరిస్థితి.
అన్నింటికంటే ముఖ్యంగా సభను అడ్డుకోవటం ఏమాత్రం సబబు కాదని.. కొన్ని కొటేషన్లు చెప్పి.. ఇన్ని మంచి మాటలు చెప్పింది ఎవరో కాదు స్వర్గీయ నెహ్రు.. ఇందిరా.. రాజీవ్ లు చెప్పారంటూ చెప్పటం ద్వారా కాంగ్రెస్ నేతల్లో అసహనాన్ని హైపిచ్ కి తీసుకెళ్లారు.
ఇలా తన ప్రసంగాన్ని సాగించే క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. కేకలు వేయటం కనిపించింది. అదే సమయంలో.. ఆమెకు వెనుక వరుసలో కూర్చున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ మాటలకు తనదైన నవ్వులు చిందిస్తూ కనిపించారు.
మోడీ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నేతలతోపాటు.. పలువురు ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనికి బదులుగా మోడీ నోటి నుంచి వచ్చిన ఒక మాట సోనియా.. రాహుల్ గాంధీల ముఖాల్ని గంభీరంగా చేసేసింది. ఇంతకీ మోడీ అన్న మాటేమిటంటే.. తన వ్యాఖ్యలపై పక్క నుంచి కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్లే సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని వ్యాఖ్యానించారు. ఆత్మన్యూనతతో ఆందోళనలు చేస్తారంటూ మోడీ నోటి నుంచి వచ్చిన మాట సోనియాగాంధీని కామ్ అయ్యేలా చేస్తే.. మోడీ ప్రతిమాటకు వ్యంగ్య తరహా నవ్వులు చిందించిన రాహుల్ ముఖాలు గంభీరమయ్యాయి. మోడీ ఒక్క మాట.. తల్లీకొడుకుల మూడ్ ని మార్చేశాయని చెప్పాలి.