కీలకమైన వేళ.. తన వ్యూహ చతురతను ప్రదర్శించారు ప్రధాని మోడీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ను గుర్తించేది లేదని.. ఆ మాటకు వస్తే ఎన్నికల్లో గెలిచింది తానేనని మకుంపట్టు ప్రదర్శిస్తున్న తన స్నేహితుడు ట్రంప్ కు షాకిచ్చారు. అంతర్జాతీయంగా విదేశీ నేతలు.. ప్రముఖులు జో బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు వీలు లేని రీతిలో ట్రంప్ ఆంక్షలు విధించిన వేళలో.. మోడీ తనదైన రీతిలో ఎత్తు వేశారు.
ట్రంప్ కు సన్నిహితుడిగా మాత్రమే కాదు.. దేశ చరిత్రలో మరే ప్రధానమంత్రి చేయని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నిక ప్రచారం చేసిన మోడీ.. తాజాగా మారిన పరిణామాలకు తగ్గట్లు తన వ్యూహాన్ని మార్చేశారు. ట్రంప్ కు సన్నిహితుడన్న ముద్రను.. సరైన సమయంలో సరైన రీతిలో విడిచి పెట్టేందుకు నాలుగు అడుగులు ముందుకు వేయటంతో పాటు.. కీలకదశలో బైడెన్ ను అమెరికా దేశాధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లుగా వ్యవహరించిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో గెలిచిన బైడెన్ కు అధికార పగ్గాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న ట్రంప్.. ఓపక్క న్యాయపోరాటానికి దిగటమే కాదు.. బైడెన్ కు వివిధ దేశాధినేతల నుంచి వచ్చే సందేశాల్ని నిలిపివేసి..ఆంక్షల్ని విధించింది. అంతేకాదు.. ట్రంప్ కేబినెట్ లోని మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. రెండో టర్మ్ లోనూ తాము అధికారంలో కొనసాగనున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వేళలో.. భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
భారతవిదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్.. జర్మనీ.. ఐర్లాండ్.. యూకే.. ఆస్ట్రేలియా.. జపాన్.. సౌత్ కొరియా తదితర దేశాధినేతలతో ఫోన్ లో మాట్లాడారని.. బైడెన్ కు.. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాకు మోడీ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అభినందించారని చెప్పారు. అతి త్వరలోనే ఇరువురు దేశాధినేతలు.. ఇద్దరికి అనువైన సమయంలో మాట్లాడుకోనున్నట్లు వెల్లడించారు.
బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పిన ఆయన.. సమయం చూసుకొని మోడీ - బైడెన్ ఇరువురు చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో మోడీ నాలుగు అడుగులు ముందుకు వేసి.. స్నేహ హస్తం చాచిన నేపథ్యంలో బైడెన్ సైతం పాజిటివ్ గా స్పందించే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. ట్రంప్ కు జిగిరీ దోస్త్ గా చెప్పే మోడీ.. అధికార మార్పిడి విషయంలో తన స్నేహితుడి మొండి వాదనకు అండగా నిలవటం లేదన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు.