ప్రధాని మోడీ ఎంత మొండోడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన వెనక్కితగ్గరు. సమకాలీన రాజకీయాల్లో దాయాది పాక్ విషయంలో మరే భారత ప్రధాని వ్యవహరించనంత కటువుగా వ్యవహరించటమే కాదు.. పాక్ నాయకత్వానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకుల మీద షాకులిస్తున్నారు. అలాంటి ఐరన్ మ్యాన్ మోడీ.. తాజాగా కంట కన్నీరు రావటం ఆశ్చర్యం కలిగించేదే.
తాజా ఉదంతాన్ని చూస్తే.. మోడీలో భావోద్వేగం పాళ్లు ఎక్కువనే విషయం అర్థమవుతుంది. తనకు గురువు.. మార్గదర్శకుడు.. తండ్రిలాంటి వాడిగా మోడీ భావించే స్వామి నారాయణ్ అధ్యాత్మిక వర్గం సారథి ప్రముఖ్ స్వామి పార్థిపదేహాన్ని సందర్శించిన వేళ మోడీ బరస్ట్ అయ్యారు. గంభీరంగా ఉన్న మోడీ.. స్వామీజీ పార్థిపదేహాన్ని చూసినంతనే తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు.
ఒక గొప్ప మార్గదర్శకుడ్ని కోల్పోయానని.. స్వామీజీ మన మధ్యలో లేకున్నా.. ఆయన బోధనలు చిరకాలం నిలుస్తాయన్న మోడీ.. తనకు తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయినట్లుగా అభివర్ణించారు. స్వామిజీని ఆఖరి చూపు కోసం వచ్చిన మోడీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఆయన కంట కన్నీరు జాలువారటం కనిపించింది. గుజరాత్ లోని సారంగపూర్ లోని 95 ఏళ్ల స్వామిజీతో ప్రధాని మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రభావం మోడీ మీద కాస్త ఎక్కువేనని చెబుతారు.