మోడీకి షాకిచ్చిన ఒడిశా ర‌చ‌యిత్రి!

Update: 2019-01-26 08:13 GMT
మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌కు సంబంధించి.. కేంద్రం ఊహించ‌ని స్పంద‌న ఒక‌టి వెల్ల‌డైంది. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం పొందిన 94 మందిలో ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి గీతా మెహ‌తా ఒక‌రు. త‌న‌కు ప్ర‌క‌టించిన ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్నితాను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

ఇంత‌కూ ఆమె ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని తిర‌స్క‌రించటానికి కార‌ణం చెబుతూ.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఇది అవార్డులు తీసుకోవ‌టానికి స‌రైన స‌మ‌యం కాద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల వేళ‌.. మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్ని తాను తీసుకోలేన‌ని చెప్పారు. త్వ‌ర‌లో దేశంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని.. అవార్డులు అందిస్తున్న టైమింగ్ అన్న‌ది స‌మాజంలో త‌ప్పుడు సందేశాల్ని అందిస్తుంద‌ని ఆమె చెప్పారు.

ఇంత‌కీ.. ఆమె ఎవ‌రో తెలుసా? ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ సోద‌రి. త‌న‌కు కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని తాను తిర‌స్క‌రిస్తున్న‌ట్లుగా ఆమె ఒక ప్రెస్ నోట విడుద‌ల చేశారు. త‌న‌కు అరుదైన గౌర‌వం ల‌భించ‌టం చాలా ఆనందంగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తాను ఆ పుర‌స్కారాన్ని స్వీక‌రించ‌లేన‌ని చెప్పారు. సాహిత్యం.. విద్యా రంగాల్లో విశేష‌మైన సేవ‌లు అందించిన ఆమె..ప‌ద్మ‌శ్రీ ద‌క్క‌టం న్యాయ‌మే. కానీ.. రాజ‌కీయ కార‌ణాలు.. స‌మీక‌ర‌ణాల‌తో ఆమె త‌న‌కు ప్ర‌క‌టించిన పుర‌స్కారాన్ని రిజెక్ట్ చేసిన‌ట్లుగా భావిస్తున్నారు.
Tags:    

Similar News