గౌతమ్ అదానీ సంపదపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ ను వాడుకొని మంత్రి కేటీఆర్ వేసిన సెటైర్ అదిరిపోయింది. కేంద్రంలోని మోడీ సర్కార్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతం అదానీ నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదానీ నికర ఆస్తుల వివుల ఏకంగా రూ.10.9 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అయితే విచిత్రం ఏంటంటే.. ఈ ఫిబ్రవరి 2022లో ఆయన నికర ఆస్తుల విలువ రూ.6.6 లక్షల కోట్లు.' దీన్నే ప్రస్తావిస్తూ... భారతదేశం వృద్ధి చెందడం లేదని ఎవరు చెప్పారు? అంటూ ప్రొఫెసర్ కే నాగేశ్వరరావ్ ట్వీట్ చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు ట్వీట్ కు కేటీఆర్ బదులిస్తూ 'ప్రతీ పేద భారతీయుడికి వాగ్ధానం చేసిన రూ.15 లక్షల మొత్తాన్ని ఒకే ఖాతాలో జమ చేశారేమో.. పొరపాటున తప్పు జరిగిందా? మోడీజీ' అంటూ ట్వీట్ చేశారు. మోడీయే తన మిత్రుడు, పారిశ్రామికవేత్త అయిన గౌతం అదానీకి దోచిపెడుతున్నాడని.. అందుకే ఈ ఆర్నెళ్లలో అదానీ సంపద అంత పెరిగిందనేలా కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఆర్నెళ్లలోనే సంపద ఈ స్తాయికి పెరగడం మానవమాత్రుడెవరికీ జన్మలో సాధ్యం కాదంటూ కేటీఆర్ కు మద్దతుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఈరోజు ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ డేటా సంచలన విషయాన్ని వెల్లడించింది. 60 ఏళ్ల వయసున్న అదానీ దాదాపు 10 లక్షల కోట్ల (137 బిలియన్ డాలర్లు) వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ప్రపంచ కుబేరుల్లో ప్రస్తుతానికి మొదటి రెండు స్థానాల్లో టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. మన అదానీ 3వ స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతం అదానీ పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకూ.. సిమెంట్ కంపెనీల నుంచి మీడియా వరకూ ప్రతీ వ్యాపారాన్ని ఆయన అందుకుంటున్న తీరే కార్పొరేట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎన్డీటీవీని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గుజరాత్ కు చెందిన వ్యాపారి గౌతం అదానీ సంపద కళ్లు బైర్లు కమ్మేలా పెరుగుతోంది. మోడీ సర్కార్ దేశంలో అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోని కుబేరులకు సైతం సాధ్యం కాని రీతిలో ఈయన సంపద పెరగడం చర్చనీయాంశమవుతోంది. ప్రతి 10వేల పెట్టుబడికి ఏడాదిలోనే రూ.52వేలకు చేరుకుంటుందంటే ఐదారురెట్లు సంపద ఈయన చేతిలో పడుతోందని తేటతెల్లమవుతోంది. ఏడాదిలో ఏకంగా 480శాతం పెరుగుదల కనిపిస్తోందంటే అదానీ సంపద ఎంత పోగు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వచ్చాక కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అందునా ప్రధాని మోడీ రాష్ట్రానికి చెందిన అంబానీలు, అదానీలు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఎదిగారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.అంబానీ, అదానీ.. ఈ ఇద్దరు గుజరాతీలు దేశ వ్యాపారరంగాన్ని అన్ని రంగాల్లో దున్నేస్తున్నారు. ఆసియాలోనే కుబేరులుగా ఎదిగారు. గుజరాత్ కే చెందిన మోడీ దేశంలో అధికారంలో ఉండడం.. వీరితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉండడంతో వీరి వ్యాపారాలు ఆశాజనకంగా దూసుకెళ్తున్నాయని ఆరోపణలున్నాయి..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.