పాతికేళ్ల కింద ఫోన్ అంటే అదో స్టేటస్ సింబల్. ఫోన్ అంటూ ఇంట్లో ఉందంటే అదోగొప్ప విషయం. ఫోన్ ఉండే ఇంటి వీధే కాదు.. పక్క వీధి వారు సైతం ఆ నెంబరును తీసుకొని.. తమకు అయిన వాళ్లకు ఇచ్చే రోజుల్ని ఇప్పుడు చెబితే ఆశ్చర్యంగా చూడటం ఖాయం. కానీ.. అలాంటి రోజుల నుంచి.. ప్రతిఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ అందులో రెండు సిమ్‌లు ఉండే రోజులు వచ్చేశాయి.
సెల్ ఫోన్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో.. అదే రీతిలో పౌర విమానయానంలో కూడా అలాంటి విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయని చెబుతున్నారు. త్వరలో మోడీ సర్కారు ప్రకటించే సరికొత్త విధానంలో ఏడాదికి మధ్యతరగతి.. సామాన్యలు సైతం విమానంలో ప్రయాణించే వీలు ఉంటుందని చెబుతున్నారు.
ఇంకా పూర్తిగా వెల్లడించని ఈ విధానం కానీ అమల్లోకి వస్తే.. ఎగురుతున్న విమానాన్ని అబ్బురం చూడటం.. ఫ్లైట్ జర్నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు నుంచి.. విమాన ప్రయాణం చాలా కామన్ అనే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. సామాన్యుడు సైతం ఏడాదిలో ఒకసారి విమానంలో ప్రయాణం చేసేలా ఈ పథకం ఉంటుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రాని ఈ కొత్త పథకం.. కచ్ఛితంగా ప్రజల జీవన విధానంలో బోలెడన్ని మార్పులు తీసుకురావటం ఖాయమంటున్నారు.