విశాఖలో మోడీ రాజకీయ టూర్

Update: 2022-11-12 09:00 GMT
ప్రధాని అంతటి వారు తమ ప్రాంతానికి వస్తే ఏదైనా మేలు జరుగుతుందని జనాలు అనుకుంటారు. కానీ రెండు రోజుల టూర్ అని చెప్పి విశాఖ వచ్చిన ప్రధాని అరగంట పాటు మాత్రమే  విశాఖ సభలో ప్రసంగం చేశారు. అది కూడా తమ ప్రభుత్వం సాధించిన విజయాలు  అవీ ఇవీ అంటూ బీజేపీ గొప్పదనాన్ని చెప్పుకున్నారు. ఒక విధంగా అది కూడా అభివృద్ధి పేరిట రాజకీయ ప్రసంగాన్నే మోడీ చేశారు అని  అంతా విశ్లేషిస్తున్నారు.

ఇక ఒక రోజు రాత్రి అంతా విశాఖలో బస చేసిన మోడీ ఏం చేశారు అంటే ఏపీలోతమ  పార్టీని పట్టాలు ఎక్కించడం ఎలా అన్న దాని మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. మోడీ వస్తూనే జనసేనాని పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా భేటీ వేయడం ఫక్తు రాజకీయమే అని అంటున్నారు. ప్రధాని వచ్చింది అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి. అది ప్రభుత్వం ఖర్చుతో జరుపుతున్న టూర్.

కానీ ఆయన పార్టీకే ప్రయారిటీ ఇచ్చారని అంటున్నారు. మిత్రపక్షం గా ఉన్న జనసేనను దగ్గరతీయడంతో పాటుగా సొంత పార్టీ బీజేపీని ఏపీలో పటిష్టం చేయడం ఎలా అన్న అజెండాతోనే ఆయన విశాఖ టూర్ లో ప్రాధాన్యత ఇచ్చారా అన్నది చర్చకు వస్తోంది. నిజానికి ప్రధాని వంటి వారు వచ్చినపుడు వీవీఐపీలను కలుస్తారు. అలాగే రాజకీయేతర ప్రముఖులతో మీట్ అవుతారు.

కానీ మోడీ దానికి భిన్నంగా రాజకీయ నేత పవన్ తో భేటీ వేశారు. మరి ఆయనతో ఏం మాట్లాడారు అన్నది తెలియదు కానీ ఆ తరువాత బీజేపీ కోర్ కమిటీ మీటింగులో ఆయన మాట్లాడిన దానిని బట్టి చూస్తే ఏపీలో బీజేపీ సొంతంగా బలపడాలని, దానికి తగిన విధంగా కసరత్తు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

అలాగే వచ్చిన వారిని తమతో కలసి నడిచేలా చేసుకోవాలని మోడీ బీజేపీ నాయకులకు హిత వచనాలు పలకడం పవన్ గురించే అని అంటున్నారు. ఏపీలో జనసేనతో సఖ్యతగా మెలగాలని ప్రధాని చెప్పుకొచ్చారు అని అంటున్నారు. ఇలా మోడీ విశాఖ టూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు అన్నవి హైలెట్ కాలేదు, ఆయన రాజకీయ భేటీలే హైలెట్ అయ్యాయి. ఆ విధంగా చూస్తే మాత్రం మోడీ టూర్ ప్యూర్ లీ పొలిటికల్ గానే సాగిందా అన్న చర్చ వస్తోంది.

మరో ఏణ్ణర్ధంలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ టూర్ ప్లాన్ చేశారు అని అంటున్నారు. అలాగే మిత్ర బంధం పటిష్టపరచుకుని ఏపీలో ఎంతో కొంత శక్తి సాధించాలని తమ పార్టీ వారికి చెప్పేందుకు ఆయన అధికారిక పర్యటనను కాస్తా రాజకీయ పర్యటనగా మార్చుకున్నారు అన్న మాటా వినిపిస్తోంది

ఏది ఏమైనా మోడీ టూర్ విశాఖ సహా ఏపీ జనాలకు పెద్దగా కిక్కివ్వలేదని అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా బీజేపీకి క్లాస్ తీసుకోవడంతో పాటు జనసేనను కలుపుకోవాలని మోడీ పన్నిన వ్యూహం మాత్రం ఎంతమేరకు సక్సెస్ అయింది అన్నది చూడాల్సి ఉంటుంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News