కేసీఆర్‌ కు మోడీ అభినంద‌న‌లు

Update: 2016-05-19 07:16 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని వనరులను పూర్తి స్థాయిలో  వినియోగించుకుని.. అభివృద్ధిలో కేసీఆర్ ముందుకు సాగడం ఆదర్శప్రాయమని కితాబిచ్చారంటున్నారు. ఇతర రాష్ట్రాలు ఇదే మార్గంలో వెళ్లాలని సూచించార‌ట‌.  తను ప్రధాని అయ్యి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధిపై గవర్నర్లు - నిఘా వర్గాల ద్వారా ప్ర‌ధాన‌మంత్రి రహస్య నివేదికలు తెప్పించుకున్నారట.

ఈ విధంగా వ‌చ్చిన నివేదిక‌ల‌న్నింటినీ సమీక్షించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను.. సీఎం కేసీఆర్ పనితీరును తన మంత్రివర్గ సహచరుల దగ్గర ప్ర‌ధాన‌మంత్రి అభినందించారట. ఈ విషయాన్ని స‌ద‌రు కేంద్ర పెద్ద‌లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో పంచుకున్నాయని స‌మాచారం. 

మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ - కల్యాణలక్ష్మి - డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు - కరువుకు శాశ్వత పరిష్కారం - విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం లాంటి అంశాలను ప్రత్యేకంగా ప్రశంసించారని తెలుస్తోంది. కేసీఆర్ ఇటీవ‌లి ఢిల్లీ పర్యటనలో వీటి గురించి ప్రధానికి వివరించినట్టు సమాచారం.
Tags:    

Similar News