కరోనా వ్యాక్సిన్ పై మోడీ సమీక్ష.. అప్ డేట్ ఇదే

Update: 2020-11-21 08:10 GMT
కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు మూడో దశకు చేరుకున్నాయి. డిసెంబర్ వరకు ఏదో ఒక వ్యాక్సిన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ దేశ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్ట్రాటజీతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎదురవుతున్న సమస్యలు, వ్యాక్సిన్ అనుమతులు, కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వ్యాక్సిన్ ను మొదట వైద్యులు, వైద్యసిబ్బందికి ఇవ్వాలని.. వసతులు పెంచి వ్యాక్సిన్ నిల్వచేసేలా ఏర్పాట్లు చేయాలని.. వ్యాక్సిన్ కంపెనీల అనుసంధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు మోడీ తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 5 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ ఐదింటిలో నాలుగు రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి.

ఇక వ్యాక్సిన్ వాడకం, అభివృద్ధి కోసం  బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, స్విట్లర్లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రియా, సౌత్ కొరియా దేశాలు భారత్ తో ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నాయని మోడీ తెలిపారు. మెడికల్ సామగ్రి కొనుగోళు తదితర ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు.
Tags:    

Similar News