మోడీ సర్.. పబ్లిసిటీ మాత్రం పీక్స్!

Update: 2021-09-23 03:34 GMT
అందరూ చేసే పనే.. కానీ అందుకు భిన్నంగా ప్రచారం చేసుకోవటంలో ప్రధాని మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇప్పటికే ప్రధానమంత్రి హోదాలో ఆదివారాలు సైతం పని చేస్తారన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆయన.. తానెంత సింఫుల్ ఉంటాననే విషయాన్ని.. పని విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను తెలిపే ఫోటోల్ని అప్పుడప్పుడు పోస్టు చేస్తుండటం తెలిసిందే.

ప్రజల మనసులపై ప్రభావాన్ని చూపించే విషయంలో మోడీ టీం అనుసరించే వ్యూహాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆ మాటకు వస్తే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని వదిలేద్దాం.. ఒక మోస్తరు స్థానాల్లో ఉన్న వారు సైతం తమకున్న పెండింగ్ వర్కును క్లియర్ చేసేందుకు.. కారులో ప్రయాణించే సమయాన్ని కూడా పని కోసం వెచ్చిస్తుంటారు. ముందు సీట్లో డ్రైవర్ కారునునడుపుతుంటే.. వెనుక సీట్లో కూర్చొని ఆఫీసు వర్కును దీక్షగా చేయటం.. మహానగరాల్లోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద సిగ్నల్ కారణంగా నిలిచి ఉన్నకార్లలో కనిపిస్తూ ఉంటుంది. అంత దాకా ఎందుకు.. ట్రైన్ జర్నీల్లో కొద్దిమంది ల్యాప్ టాప్ ను ముందేసుకొని పని చేసుకుంటూ పోతారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రయాణాల్లో పని చేయటం పెద్ద విషయం కాదు. అందునా అమెరికాలాంటి దూరాన ఉన్న దేశాలకు ప్రయాణమయ్యే వేళలో.. అంతటి ప్రయాణ సమయాన్ని వేస్టే చేసే కన్నా.. ముఖ్యమైన ఫైళ్లను క్లోజ్ చేయటం.. పెండింగ్ పనుల్ని పూర్తి చేయటం మీద కీలకస్థానాల్లో ఉన్న వారు పని చేస్తుంటారు. అయితే.. పబ్లిసిటీని ఎంత వాడాలో అంతే వాడటం.. ప్రచారం చేసుకుంటున్నట్లుగా.. గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా కాకుండా.. జరుగుతున్న దాన్నిమితంగా చెప్పటం ద్వారా.. ఆసక్తిని రేపేలా మోడీ టీం ప్లానింగ్ ఉంటుంది.

ఐదు రోజుల అమెరికా టూర్ కోసం బయలుదేరిన మోడీ.. విమానంలోనూ ఆయన ఆఫీస్ వర్కు చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పర్యటనలో పలు భేటీలు జరపనున్న ఆయన.. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆయన న్యూ ఢిల్లీ చేరుకుంటారు.  ఈ లోపు ఆయన ఇమేజ్ పెంచేందుకు మోడీ సోషల్ మీడియా టీం అలుపెరగక పని చేస్తారనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News