ఆయన అఫ్ఘన్లు మెచ్చిన భారత ప్రధాని

Update: 2015-12-25 08:41 GMT
తరచూ విదేశీ ప్రయాణాలు చేస్తుంటారని ప్రధాని మోడీ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ విరుచుకుపడుతుంటారు. దేశంలోని ప్రత్యర్థి రాజకీయ పక్షాల విమర్శనాస్త్రాలు ఎలా ఉన్నా.. తన మాటలతో మాత్రం విదేశీ నేతల్ని మాత్రం ఆకర్షిస్తున్నారనే చెప్పాలి. తాజాగా రష్యా పర్యటనను ముగించుకొని.. అప్ఘనిస్తాన్ కు వెళ్లిన ఆయన.. ఆ దేశ పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన మాటలతో ఆయన అక్కడి వారి మనసులు దోచుకున్నారు.

మోడీ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు చూస్తే..

= 125 కోట్ల భారతీయ స్నేహితుల ప్రతినిధిగా మీ ముందున్నా.
= ఈ పార్లమెంటు భవనం రెండు దేశాలు.. జాతుల మధ్య వారధిగా నిలుస్తుంది.
= జాతికి చేసిన సేవ.. ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఈ భవనం నిలుస్తుంది.
= ఈ భవనంలో ఒక బ్లాక్ కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరు పెట్టటం ఆనందంగా ఉంది.
= పార్లమెంటు భవనం ప్రారంభంతో హమిద్ కర్జాయ్ కల నెరవేరింది.
= అఫ్ఘనిస్తాన్ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి భారత్ అండగా ఉంటుంది.
= అఫ్ఘన్ ఆర్థిక స్వాలంబనకు అవసరమైన ప్రతి సాయాన్ని భారత్ అందిస్తుంది.
= అఫ్ఘన్.. భారత్ ప్రజల మధ్య ఒకరిపై ఒకరికి హద్దుల్లేని బంధం ఉంది.
= వచ్చే ప్రపంచకప్ కోసం అప్ఘనిస్తాన్ క్రికెటర్లు ఢిల్లీలో సన్నద్ధమవుతున్నారు.
= అఫ్ఘనిస్తాన్ అమరవీరుల పిల్లల కోసం 500 స్కాలర్ షిప్ లు ఇస్తాం. వారికి ప్రతి నెలా డబ్బులు ఇస్తాం.
= ఐటీ విద్య కోసం కొత్త విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
= కొత్త రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాల రుణాలు ఇస్తాం.
= విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తాం.
Tags:    

Similar News