ఆ రికార్డు మొద‌ట మోడీది..త‌ర్వాత బాబుదే

Update: 2017-12-13 17:20 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీ ప్లేన్‌ లో ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే.గుజరాత్‌  పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. తొలిసారి సీ ప్లేన్‌ లో ప్రయాణం చేశారు. సబర్మతి నది నుంచి  సీ ప్లేన్‌  ద్వారా ధారోయ్‌  డ్యామ్‌  కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోడీజీ చివ‌రి రోజు చేసిన ఈ రికార్డును ఆ మ‌రుస‌టి రోజే..ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కొన‌సాగించిన‌ట్ల‌యింది. త‌ద్వార మోడీ త‌ర్వాత రెండో వ్య‌క్తిగా బాబు నిలిచారు.

కృష్ణానదిలో సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. సీప్లేన్ లో సీఎం చంద్రబాబునాయుడు - కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులు విహరించారు. సీప్లేన్ లో వీరితో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు - భూమా అఖిలప్రియ ఉన్నారు. విజయవాడలో సీప్లేన్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సీప్లేన్ తయారు చేసిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. సీప్లేన్ తయారు చేయాలంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలన్నారు.ఇన్ లాండ్ వాటర్ వేస్ ను అభివృద్ది చేస్తామన్నారు. ప్రపంచంలో టూరిజానికి చాలా ప్రాధాన్యత వచ్చిందన్నారు. టూరిజం అభివృద్ది కావాలంటే ఇన్ఫ్రా స్టక్చర్ భాగుండాలన్నారు. అన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎయిర్ పోర్టులు నిర్మించే అవకాశం లేని చోట సీప్లేన్ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. కేంద్రం లో ఎయిర్ కనెక్టివిటీలు రావాలన్నారు. ఆ తర్వాత రాష్ట్రాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీలు వస్తాయన్నారు.

టూరిజం - సర్వీస్ సెక్టార్లతోనే ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టూరిజం కోసం అందరం కలిసి కృషి చేస్తామన్నారు. అమరావతి నుంచి అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.  ప్రకాశం బ్యారేజీని పర్యాటకంగా అభివృద్ది చేస్తామన్నారు. టూరిజం మనకు చాలా ముఖ్యమన్నారు.
Tags:    

Similar News