ఈ నెల 19న తెలంగాణకు వస్తారని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు పీఎంవో వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అయితే.. దీనికి ప్రధానంగా మోడీ మాతృమూర్తి హీరాబెన్ మరణంతో ఆయా కార్యక్రమాలకు సంబంధించిన క్రతువుల కోసం.. 19న మోడీ గుజరాత్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పర్యటన వాయిదా పడిందని సమాచారం.
ఇదిలావుంటే.. ఈ నెల 19న ప్రధాని మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన బిజీ షెడ్యూల్ గడపాలని కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ కార్యకలాపాలపైనా మోడీ దృష్టి పెడతారని తెలిసింది. అవేకాకుండా.. అధికారిక కార్యక్రమాలతోపాటు పలు రాజకీయ కార్యక్రమాలు కూడా మోడీ పర్యటనలో భాగంగా ఫ్లాన్ చేశారని సమాచారం.
ముఖ్యంగా తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలును ప్రారంభించడంతోపాటు సికింద్రాబాదు- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమాల తోపాటు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ప్రదాని మోడీ పర్యటన వాయిదా పడడంతో ఈ పనులన్నీ వాయిదా వేసినట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.