సోమనాథ్ ఆలయ కొత్త చైర్మన్ గా ప్రధాని మోదీ!

Update: 2021-01-19 03:30 GMT
దేశంలోని  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమ నాథ్ ఆలయ ట్రస్ట్ కొత్త చైర్మన్ గా  ప్రధాని నరేంద్ర మోదీ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్లోని సౌరాష్ట్రం, గిర్  సోమనాథ్ జిల్లా,  ప్రభాస్ పట్టణంలో సోమనాథ్  ఆలయం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం మొదటిది. ఈ ఆలయ ట్రస్ట్  చైర్మన్ గా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఈ ఆలయ ట్రస్టీగా  కొనసాగుతున్న మోదీని  నూతన ఆలయ చైర్మన్ గా ఎన్నుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

 సోమనాథ్ ఆలయానికి గత కొన్నేళ్లుగా ట్రస్ట్ చైర్మన్ గా పనిచేసిన గుజరాత్ మాజీ సీఎం కేశూ భాయ్ పటేల్ అక్టోబర్ లో మరణించగా అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. కరోనా నేపథ్యంలో నేరుగా సమావేశాలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో ఆలయ కమిటీ 120 వ సమావేశం సోమవారం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ట్రస్ట్ సభ్యులు కొత్త చైర్మన్గా ప్రధాని మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ సెక్రటరీ పీకే లెహ్రీ తెలిపారు. సోమనాథ్ ఆలయ  ట్రస్ట్ లో ఇతర ట్రస్టీలుగా బీజేపీ  సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.

 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథుడి ఆలయంపై ఆరుసార్లు ముస్లింల దాడులు జరిగాయి. ఫలితంగా ఆ దేవాలయం భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపిస్తూ ఉంటుంది.  దాడుల తర్వాత మహామేరు ప్రసాద్ పద్ధతిలో ఆలయాన్ని పునర్నిర్మించారు. భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుపొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయానికి మార్గదర్శకులుగా చెప్పవచ్చు.
Tags:    

Similar News