కేటీఆర్ మాట‌ల‌కు మోడీ రియాక్ట‌య్యారు!

Update: 2016-01-19 04:55 GMT
"తెలంగాణ భార‌త‌దేశంలో లేదా? ప‌్ర‌పంచ దేశాల‌న్నీ తిరుగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి తెలంగాణ‌కు రావాల‌ని ఎందుకు గుర్తుకురాదు? ఎన్నో ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు చేసినా..వాటికి ముఖ్య అతిథిగా రావాల‌ని ఆహ్వానించిన ప్ర‌ధానికి ఎందుకు ప‌ట్ట‌దు? రావ‌ద్దు అనుకుంటే రాను అని ప్ర‌క‌టించాలి"- ఇది తెలంగాణ రాష్ట్ర మంత్రి - సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ప్ర‌ధాన‌మంత్రిపై చేసిన ఘాటు విమ‌ర్శ‌లు.

కేటీఆర్ ఇలా  పలు సందర్భాల్లో విమర్శించిన నేప‌థ్యంలో క‌మ‌ళ‌నాథులు కూడా స్పందించారు. అస‌లు ఆహ్వానించకపోవడం వల్లే ప్రధాని రాలేదని బీజేపీ నేతలు సమాధానం చెప్పారు. దీనికి టీఆర్ ఎస్ స్పందిస్తూ...మూడు కార్యక్రమాల కోసం ఆహ్వానించినా రాలేదని వాదిస్తూ వచ్చారు. అయితే ఈ వాదోప‌వాదాల‌కు తాజాగా ఇపుడు ఫుల్‌ స్టాప్ ప‌డింది! త్వ‌ర‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి ఫిబ్ర‌వ‌రీ మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌ లో పర్యటించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత, తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోడీ తొలి పర్యటన ఇదే.

అయితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న గురించి బీజేపీ నేత‌లో లేదా కేంద్ర ప్ర‌భుత్వ‌మో చెప్ప‌లేదు. రాష్ర్ట‌మంత్రి-సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హరీశ్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరడంతో ప్రధాని నరేంద్ర మోడీ సుముఖత వ్యక్తం చేశారని హరీశ్‌ రావు ప్రకటించారు. మిషన్ కాకతీయపై హరీశ్‌ రావు సమీక్ష జరుపుతున్న సంద‌ర్భంగా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు ప్రధాని హాజరవుతున్న నేప‌థ్యంలో ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.
Tags:    

Similar News