ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. వదల బొమ్మాళీ అంటూ విరుచుకుపడుతున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కార్యక్రమంలో కీలకమైన రెండోఅంకం మొదలైంది. దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అరవైఏళ్లు దాటిన పెద్ద వయస్కులకు.. వివిధ వ్యాధులు ఉన్న నడి వయస్కులకు టీకాను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున ప్రధాని మోడీ.. ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి టీకా వేసుకున్నారు. ఈ అంశం వైరల్ గా మారటమే కాదు.. టీకా మీద కొత్త నమ్మకం వచ్చేలా చేసినట్లు చెబుతున్నారు.
దీనికి తగ్గట్లే తొలిరోజున భారీ ఎత్తున వ్యాక్సిన్ వేసుకోవటం కనిపించింది. తొలిదశలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అంత జోరుగా సాగలేదు. పలు అనుమానాలు.. భయాలు వారిని వెంటాడాయి. దీంతో.. కరోనా వారియర్స్ మాత్రమే కాదు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా టీకాలు వేసుకోవటానికి అంత ఆసక్తిని చూపించలేదు. అందుకు భిన్నంగా సెకండ్ ఫేజ్ ఉండటం గమనార్హం. అయితే.. దీనికి మోడీ కూడా ముఖ్య కారణమని చెప్పాలి.
రెండోదశ షురూ కావటానికి ముందు అప్పటి ఉన్న సందేహాలకు ప్రధాని స్వయంగా వ్యాక్సిన్ వేసుకోవటంతోఒక సానుకూలత ప్రజలకు పాస్ అయ్యిందని చెబుతున్నారు. ఈ కారణంతోనే తొలిరోజే భారీగా టీకాలువేసుకోవటం కనిపించింది. రెండో దశలో వ్యాక్సిన్ ను తొలి రోజున 4.27 లక్షల మంది వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా మోడీ బోణీ అదిరిపోయిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ కోసం ఇప్పటివరకు 23 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవటం కూడా సానుకూల అంశమని చెప్పక తప్పదు. టీకా వేసుకోవాలనుకునే వారు.. ముందుగా ఆన్ లైన్ లో తమ వివరాల్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుస క్రమంలో అవకాశం లభిస్తుంది.