ఆయనా మోడీనే ఈయనా మోడీనే. ఆయనకూ భారీ చాతీ ఉంది. ఈయనకూ అంతే ఉంది. మరి ఎవరు తక్కువ. ఎవరు ఎక్కువ. అందుకే దేశ ప్రధాని, బలమైన నేత నరేంద్ర మోడీనే ఢీ కొడుతున్నాడు ఆయన గారి తమ్ముడు ప్రహ్లాద్ మోడీ.
దేశంలో అన్న పాలన బాగుందని బీజేపీ నేతలు అంటూంటే అన్న ఏలుబడి మీదనే తమ్ముడు స్వయాన నిరసన తెలియచేయడం నిజంగా గ్రేట్. ఒక విధంగా ప్రజాస్వామ్యానికి ఇది అద్దం పట్టే చర్యగా చూస్తున్నారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ప్రహ్లాద్ మోడీ అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మారిన జీవన పరిస్థితులు, ఆర్ధిక భారాల నేపధ్యంలో రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్లను మరింతగా పెంచాలని తమ్ముడు మోడీ అన్న మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రధాని తమ్ముడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ఆందోళన సాగింది.
చౌక దుకాణాల ద్వారా బియ్యం, గోధుమ, పంచదారా వంటి వాటిని పంపిణీ చేస్తే రేషన్ డీలర్లకు మరీ దారుణంగా కిలోకు ఇరవై పైసలు కమిషన్ మాత్రమే పెంచడం కంటే క్రూరత్వం మరోటి లేదని మోడీ సర్కార్ మీదనే ప్రహ్లాద్ మోడీ మండిపడ్డారు. ఏమి తినాలి, ఎలా బతకాలని ఆయన నిలదీశారు.
ఈ విషయంలో తమకు న్యాయం చేయాల్సిందే అని ప్రహ్లాద్ మోడీ డిమాండ్ చేశారు. లేకపోతే మరింత పెద్ద ఎత్త్న ఉద్యమం చేపడతామని కూడా స్పష్టం చేశారు. ఇంకో వైపు అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం కార్యవర్గం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తుంది.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రధాని మోడీని కూడా కలుస్తారని అంటున్నారు. అటు అన్న ఇటు తమ్ముడు మరి డిమాండ్ చూస్తే న్యాయంగా ఉంది. ప్రహ్లాద్ మోడీ సైతం పేదల పక్షమే మాట్లాడుతున్నారు కాబట్టి అన్న మోడీ రేషన్ డీలర్లకు ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.