రష్యా వెళ్లి జనగణమణ మర్చిపోయారా మోడీ

Update: 2015-12-24 08:30 GMT
ప్రధాని నరేంద్రమోడీ విదేశీ ప్రయాణాల మీద ఇప్పటికే భారీగా విమర్శలు వినిపిస్తుంటాయి. ఆయన విదేశీ పర్యటనల మీద జోకులు కూడా ఎక్కువే. ఫారిన్ టూర్ల ఖాతాలో తాజాగా ఆయన రష్యా టూర్ లో ఉన్నారు. దేశ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటివరకూ పదుల సంఖ్యలో విదేశాలకు వెళ్లినా.. ఎక్కడా ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి ఈసారి ఎదురైంది.  రష్యాలో ల్యాండ్ అయిన తర్వాత .. మోడీ రాకకు గౌరవ సూచకంగా దేశ జాతీయ గీతమైన జనగణమణను ప్లే చేశారు.

మరి.. ఏ మూడ్ లో ఉన్నారో కానీ మోడీ జనగణమణను పట్టించుకోకుండా వెళ్లటం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయన చేస్తున్న తప్పును గుర్తించిన ఒక రష్యా అధికారి ఆయన్ను ఆపి.. ఆయన నిలుచోవాల్సిన ప్లేస్ ను చూపించారు. తాను చేసిన తప్పును గుర్తించి సర్దుకున్న మోడీ.. జనగణమణ పూర్తి అయ్యే వరకూ నిలబడిపోయారు.

ఎంత విదేశాలకు వెళితే మాత్రం దేశ జాతీయగీతాన్ని మర్చిపోతారా? అంటూ మోడీ వ్యతిరేకులు దెప్పి పొడుస్తున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త ఆచితూచి.. చుట్టూ పరిస్థితుల్ని చెక్ చేసుకుంటూ ముందుకెళ్లటం బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మరి.. మోడీ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదేమో. ఇలాంటి భావోద్వేగ ఉదంతాలు భారీ డ్యామేజ్ చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News