నాలుగున్నరేళ్లుగా పేదలు, సంక్షేమం బాటపట్టని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముందర ప్రజలపై వరాల వాన కురిపించారు. నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6వేల చొప్పున రైతుబంధు ఇవ్వడానికి ‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రారంభించింది. ఐదెకరాల భూమి లోపు ఉన్న రైతులకు రూ.6వేలను అందిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం తాజాగా నిప్పులు చెరిగారు.
చిదంబరం మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొంటోందని ఆరోపించారు. ఓట్ల ఎత్తుగడలో భాగంగానే పీఎం మోడీ కిసాన్ సమ్మాన్ పథకానికి శ్రీకారం చుట్టి రూ.2వేలను మొదటి విడత బ్యాంకుల్లో వేశారని ట్విట్టర్ లో చిదంబరం ఎండగట్టారు. ఈ పథకాన్ని ‘ఓట్ల కోసం లంచం’ స్కీమ్ గా అభివర్ణించారు. దీన్ని ఎన్నికల సంఘం అడ్డుకోకపోవడం దారుణమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈస్కీమ్ తెచ్చారని ఆరోపించారు.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజనను మోడీ యూపీలోని గోరఖ్ పూర్ లో తాజాగా ప్రారంభించారు. తొలి విడతలో యూపీతో సహా 14 రాష్ట్రాల్లోని రైతుల ఖాతాలో రూ.2వేలు జమ చేశారు. మిగతా నాలుగువేలు రెండు విడతల్లో జమచేస్తారు. మొత్తం 12కోట్ల మంది రైతులకు ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణలో 21లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులు. కేంద్రం దీనికోసం 75వేల కోట్లను వెచ్చిస్తోంది.