పుట్టు వెంట్రుకలకు బాలయ్య కొడుకు రాలేదే?

Update: 2015-11-28 04:47 GMT
కుటుంబ కార్యక్రమంగా జరిగే కొన్నింటిలో ఆనవాయితీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిపై చర్చ అనవసరం అని అంటారు కానీ.. ప్రముఖల ఇళ్లల్లో జరిగే విషయాలపై ప్రజలకు ఆసక్తి ఎక్కువే. వాస్తవానికి సామాన్యులైనా.. ఆనవాయితీకి భిన్నంగా ఏదైనా జరిగితే.. దాని గురించి ఆసక్తిగా చర్చించుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట చోటు చేసుకుంది.

చంద్రబాబు మనమడు దేవాన్ష్ (లోకేశ్.. బ్రాహ్మణి దంపతుల కుమారుడు) పుట్టు వెంట్రుకల కార్యక్రమం చిత్తూరుజిల్లా బాబు స్వగ్రామం నారావారి పల్లెలో ఘనంగా జరిగింది. ఈ కుటుంబ కార్యక్రమంలో దేవాన్ష్ పుట్టు వెంట్రుకల్ని తీయించే సమయంలో మేనమామ (బ్రాహ్మణి తమ్ముడు) మోక్షజ హాజరుకావాల్సి ఉంది. పుట్టువెంట్రుకల కార్యక్రమం మేనమామ చేతుల మీదుగా జరగాల్సి ఉంటుంది.

అయితే.. ఇందుకు భిన్నంగా బాలయ్య కుమారుడు.. బ్రాహ్మణి తమ్ముడైన మోక్షజ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. అతి ముఖ్యమైన కార్యక్రమానికి మేనమామ అయిన బాలయ్య కుమారుడు ఎందుకు హాజరు కాలేదన్న సందేహం పలువురి నోట వినిపించింది. మోక్షజ గైర్హాజరీ నేపథ్యంలో ఈ బాధ్యతను చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్ కుమార్.. దేవాన్ష్ ను ఒళ్లో పెట్టుకొని పుట్టు వెంట్రుకల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బాలయ్య కుమారుడు ఎందుకు గైర్హాజరు అయ్యారన్న విషయం మాత్రం ఎవరూ పెదవి విప్పింది లేదు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి ఎందుకు డుమ్మా కొట్టినట్లు..?
Tags:    

Similar News