టీడీపీ అధినేతచంద్రబాబు అంటే.. 40 ఇయర్స్‌పొలిటికల్ ఇండస్ట్రీనే అని మనం అనుకుంటాం. పోనీ.. ఆయన చెప్పుకునే మాటలను బట్టి.. విజన్ ఉన్న నాయకుడిగా మేధావులు భావిస్తారు.కానీ, `అంతకు మించి` అన్న విధంగా చంద్రబాబులో మరో మనిషి ఉన్నారు. ఆయన కృషిలో మరో కోణం కూడా ఉంది. ఇది బహుశ ఇప్పటి వరకు ఎవరూ వినని, కనని విషయం. అదేవిధంగా ప్రముఖ ఆర్థిక వేత్త.. మాంటెక్ సింగ్ అహ్లూ వాలియా బయట పెట్టారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు ను అహ్లూవాలియా పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు అకుంఠిత దీక్షకు, కృషికి.. పనితనానికి అంతకుమించిన దూరదృష్టికి ఆయన కితాబిచ్చారు. ‘‘కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతర కృషి అవసరం.
అందుకు ఉదాహరణే.. సైబరాబాద్. సైబరాబాద్ నిర్మాణం వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆయన ఓ బోల్డ్ అండ్ అన్‌యూజువల్ పర్సన్. ఆనాడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల ఫలితమే`` అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ``ఇప్పుడు సైబరాబాద్ ఖ్యాతిగా కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యో గాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు థాంక్స్ చెప్పాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఓ ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ.. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా చంద్రబాబు కృషికి సంబంధించిన ఒక కీలక విషయాన్ని ఆయన వెల్లడించారు.
అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలిసేందుకు చంద్రబాబు విశ్వప్రయ త్నం చేశారన్నారు.
‘‘తనను తాను ఆంధ్రప్రదేశ్ సీఈవోగా పరిచయం చేసుకుని, అపాయింట్‌మెంట్ తీసుకున్నారు చంద్రబాబు. అతి కష్టమ్మీద బిల్‌గేట్స్ అపాయింట్‌మెంట్ దొరికింది. చంద్రబాబు 90 నిమిషాలపాటు ఆయనకు తన ప్రణాళికను వివరించారు. అంతే.. బిల్‌గేట్స్ చంద్రబాబు వెంట హైదరాబాద్‌కు వచ్చారు’’ అని అహ్లూవాలియా గుర్తుచేశారు.