అంబానీ కంటే ఎక్కువ జీతం.. ఇతడెవరు? అతడికి వచ్చే శాలరీ ఎంతంటే?

Update: 2023-01-15 00:30 GMT
ప్రముఖ ఐటీ కంపెనీల పేర్లు చెప్పినప్పుడు పక్కాగా వినిపించే అతి కొద్ది పేర్లలో కాగ్నిజెంట్ ఒకటి. వేలాది మంది ఐటీ ఉద్యోగులున్న ఈ ప్రముఖ ఐటీ కంపెనీకి తాజాగా కొత్త సీఈవోను ఎంపిక చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవికుమార్ ఎంపికయ్యారు.

కంపెనీ బోర్డులో స్థానం దక్కించుకున్న ఇతగాడు కాగ్నిజెంట్ లో ఆన్ డిమాండ్ సొల్యూషన్స్.. సాలిడ్ బ్రాండింగ్.. అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. ఐటీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవైఏళ్లకు అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయన వార్షిక జీతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా కాగ్నిజెంట్ అతడికి ఆఫర్ చేసిన జీతం.. భత్యాలు కలుపుకుంటే అపర కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి జీతం రూపంలో వచ్చే దాని కంటే ఎక్కువ మొత్తం రవికుమార్ కు లభించటం ఆసక్తికరంగా మారింది. 2020లో రవి కుమార్ జీతం ముకేశ్ అంబానీ కంటే ఎక్కువన్న విషయాన్ని చెబుతున్నారు. అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువని.. అతడికిఏడాదికి జీతం రూపంలో రూ.57 కోట్లు.. దాదాపు రూ.6 కోట్లను జాయినింగ్ బోనస్ గా అందుకోనున్నారు.

సాధారణంగా వార్షిక బేసిక్ సాలరీగా ఒక మిలియన్ డాలర్లను కంపెనీ చెల్లిస్తుంది. అదే విధంగా 2 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం.. వన్ టైం హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్ లను పొందనున్నారు. 2019-20లలో ముకేశ్ అంబానీ వార్షిక జీతం రూ.15 కోట్ల కాగా.. ఇప్పుడురూపాయి మాత్రమే తీసుకుంటున్నారు.

రవికుమార్ గతాన్ని చూస్తే.. 2016 నుంచి 2022 మధ్యలో ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా వ్యవహరించటంతో పాటు ట్రాన్స్ యూనియన్న... డిజి మార్కోకార్ప్ బోర్డుల్లో పని చేసిన అనుభవం ఉంది. తమ కంపెనీకి చెందిన హంఫ్రీస్ రాజీనామా చేయటంతో రవికుమార్ ను తాజాగా హైర్ చేస్తూ ప్రకటన జారీ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News