ఈ భూమి పై ఏ జీవికి అయిన తన బిడ్డతో ఆటలాడితే కోపం ఆకాశానికి తాకుతుంది. అటువైపు ఉన్నది ఎవరైనా సరే చీల్చి చెండాడుతుంది. ఈ విషయంలో ఏనుగులకు కాస్త కోపం ఎక్కువే. సాధరణంగా డిస్టర్బ్ చేస్తేనే గజరాజులు రెచ్చిపోతాయి. ముఖ్యంగా వాటి పిల్లల జోలికి వస్తే మాత్ర వారితో ఫుడ్ బాల్ ఆడతాయి. అలాంటి ఘటనే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకుంది.
సుర్లా–స్వర్ణాపురం తీరంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్లింది. సుర్లాస్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి సెల్ఫీలు దిగారు. కొద్దిసేపు గున్న ఏనుగుతో సరదాగా గడిపారు. దీన్ని చూసిన తల్లి ఏనుగు ఆగ్రహంతో ఊగిపోయింది. నా పిల్లతోనే ఆటలా అంటూ వెనక్కి దూసుకొచ్చింది.
అయితే, నదిలో చేపలు పడుతున్న ఓయువకుడు ఏనుగు రాకను గమనించకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఏనుగు రాకతో బెంబేలెత్తిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు.ఈ సంఘటనను మొత్తం కొంతమంది వీడియో తీసి పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.