చంద్రబాబు పెద్ద నట చక్రవర్తి

Update: 2018-05-28 07:42 GMT
టీటీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుప‌ల్లి అనంత‌రం టీడీపీ అధినేత చంద్ర‌బాబు మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ఘాట్‌ లో భావోద్వేగానికి గురైన మోత్కుపల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. దివంగ‌త ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారని వ్యాఖ్యానించారు.రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారని దుయ్య‌బ‌ట్టారు. దగ్గుబాటి కుటుంబాన్ని, నందమూరి హరికృష్ణను చంద్రబాబు వాడుకొని వదిలేశారని ఆరోపించారు.

కుట్రలు - కుతంత్రాలకు చంద్రబాబే కారణమని మోత్కుప‌ల్లి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఆనాడు రాజకీయ కుట్రలకు ఎన్టీఆర్ బలయ్యారని, అదే రీతిలో తాను రాజకీయ కుట్రలకు బలి అయ్యానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే కుట్రను చంద్రబాబు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెద్ద నట చక్రవర్తి అని ఆరోపించారు. ``కాపులు - బీసీల మధ్య చంద్రబాబు గొడవ పెడుతున్నారు.  మాల - మాదిగల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు బ్రాహ్మణులను కూడా వదలడం లేదు. పవన్ - జగన్ సొంత జెండా పెట్టుకున్నారు..వాళ్లు మొగోళ్లు. ఎన్టీఆర్ నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగతనం చేశారు. చంద్రబాబుకు చరిత్రలో ఓ నల్ల పేజీ ఉంది. చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి. హోదాపై యూ టర్న్ తీసుకుని సిగ్గు లేకుండా మళ్లీ హోదా అంటున్నారు. చంద్రబాబును పాతాళంలోకి తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  రాజ్యసభ సీటును చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.

టీడీపీ పగ్గాలు నందమూరి ఫ్యామిలీకి అప్పగించాల‌ని మోత్కుప‌ల్లి డిమాండ్ చేశారు. ``కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. చంద్రబాబు దొరకని దొంగ. తెలంగాణ సీఎం. కేసీఆర్ కు చంద్రబాబు సరెండయ్యారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చర్యలు తీసుకోవాలి`` అని కోరారు. పోలవరం ప్రాజెక్టులో రూ.వందల కోట్లు కమీషన్లు తీసుకున్నార‌ని ఆరోపించారు. ``చంద్రబాబుకు ఓటు వేయకండి..ఓడించండి అని పిలుపునిచ్చిన మోత్కుపల్లి నర్సింహులు అవసరమైతే ఆంధ్రలో రథయాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News