ఎలాంటి మూడ్ లో ఉన్నారో కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఎటకారం చేసుకుంటున్నారు. చౌహాన్ మాటలు విన్నవారంతా ఏదో ఒక కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
ఇలా పలువురిని ఆకర్షించటమే కాదు.. నోట్లో నుంచి ఏదో ఒక మాట వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి చౌహాన్ గొప్పతనాన్ని కీర్తించాల్సిందే. ఇంత మందిని కదిలించేలా చౌహాన్ జీ నోటి నుంచి వచ్చిన మాటేమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. పెట్టుబడులు ఆకర్షించే పనిలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల కోసం వెళ్లిన ముఖ్యమంత్రి ఆ పని మీద ఫోకస్ పెట్టినట్లుగా వ్యవహరిస్తే బాగుంటుంది. అలా కాకుండా.. అమెరికా రోడ్ల మీద ఆయన కన్ను పడింది. మనసులో ముద్ర పడిపోయిన అమెరికా రోడ్ల గురించి ఇండియా - అమెరికా వ్యూహాత్మక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు.
నలుగురు మధ్యలో మాట్లాడుతున్నానన్న స్పృహ లేకుండా ఆయన.. తాను కార్లో ప్రయాణిస్తున్నప్పుడు చూస్తే.. వాషింగ్టన్ రోడ్లతో పోలిస్తే మధ్యప్రదేశ్ రోడ్లు చాలా బాగుంటాయంటూ కితాబునిచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అధినేత నోటి నుంచి అలాంటి మాటలు రావటం షాకింగ్ గా మారింది. చౌహాన్ సాబ్ మాటలైతే మాట్లాడారు కానీ.. ఆ తర్వాత వచ్చే రియాక్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదేమో.
చౌహాన్ మాటలకు సోషల్ మీడియా రియాక్ట్ అయ్యింది. ఎటకారం చేసుకునే పనిలో భాగంగా.. నెదర్లాండ్ లోని అండర్ వాటర్ టన్నెల్ ఫోటోను ట్విట్టర్ లో పెట్టి గ్వాలియర్ అండర్ వాటర్ టన్నెల్ అనుకుంటా అని కామెంట్ చేస్తే.. మరొకరు చైనాలోని షాంఘై నది మీదున్న నాన్పు బ్రిడ్జిని పోస్ట్ చేస్తూ జబల్పూరు అప్రోచ్ రోడ్డు అంటూ కామెంట్ చేశారు.. ఇంకొకరైతే.. ఆ మధ్యన కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు మునిగిపోవటంతో సీఎం చౌహాన్ ను పోలీసులు మోసుకెళుతున్న ఫోటోను పెట్టి.. మధ్యప్రదేశ్ రోడ్లు..క్లీన్ అండ్ స్మూత్ అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేసుకోవటం గమనార్హం. కెలికి మరీ తిట్టించుకోవటం అంటే ఇదే!