ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదో లేదో.. మిత్రపక్షం.. కూటమికి పెద్దన్న అనే ట్యాగ్ లైన్ ను తగిలించుకుని ఇష్టానుసారంగా చెలరేగుతున్న భారతీయ జనతా పార్టీకి అర్థం కావడం లేదు. కానీ తెలంగాణలో ఉన్న పోటీ ప్రభుత్వంలోని వారికి కూడా అర్థమవుతోంది. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి తెరాస నాయకులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. లోక్ సభలో తన ప్రసంగంలోనే ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం అని, వారి ఆందోళన సబబైనదే అని... రాష్ట్ర విభజన సందర్భంగా సభలో ఇచ్చిన హామీలు అన్నిటినీ ఆ రాష్ట్రానికి నెరవేర్చాలని అనడం ఆసక్తికరం. అలాగే.. విభజన చట్టం పేర్కొనే అంశాల మేరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కూడా కవిత సభలో కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా నిజానికి రాష్ట్ర ప్రయోజనాల మీద ఇంత పట్టింపు ఉన్నట్లుగా వారు ఇప్పటిదాకా నిరూపించుకోలేదు. ఎంతసేపూ మోడీ అనుకూల భజన చేయడం మినహా వారికి మరొక అంశం పట్టదు. రాష్ట్రానికి నిజంగా రావాల్సిన వాటి గురించి తాము పోరాడకపోతే పాయె.. కనీసం కేంద్రంలోని తమ ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేసి అయినా సాధించుకు వద్దామనే శ్రద్ధ వారికి ఉండదు. అయితే ఇలాంటి ఆషాఢభూతి నాయకులందరికీ కనువిప్పు కలిగేలా ఏపీ సమస్యల గురించి తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత పాజిటివ్ గా మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
విభజనకు ముందు.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఇదే తెరాసకు చెందిన నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్ర ప్రాంత వాసన అంటేనే ఎంతగా ఉడికిపోయే వారో అందరికీ తెలుసు. ఆ పోరాట సమయంలో ఆంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్లు గమనిస్తే.. అసలు విభజన తర్వాత అయినా ఆంధ్రుడనే వాడిని ఒక్కరినైనా తెలంగాణలో ఉండనిస్తారా అనే రేంజిలో సాగిపోయాయి. కానీ రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రులంతా తమవారేనని, అప్పుడేదో భావోద్వేగాల్లో తీవ్రంగా మాట్లాడాం అంటూ వారిని మెప్పించగలిగారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ విభజన వలన ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం నిజమే అని సానుభూతి చూపిస్తున్నట్లుగా.. ఇవాళ లోక్ సభలో కవిత చేసిన ప్రసంగం.. ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తాము కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పడం.. ఏపీ ప్రజల మన్ననలు కూడా పొందుతోంది.