ఢిల్లీకి స్పెష‌ల్ ఫ్లైట్ లో వెళ్లిన ఎంపీ సంతోష్!

Update: 2019-07-26 07:01 GMT
ప్ర‌త్యేక విమానాల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ప్ర‌యాణిస్తుంటారు. అదే ప‌నిగా స్పెష‌ల్ ఫ్లైట్స్ ను వాడేసినా ప‌లువురు నేత‌లు త‌ప్పు ప‌డుతుంటారు. అలాంటిది రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కాదు.. కేవ‌లం టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు మాత్ర‌మే అయితే జోగినిప‌ల్లి సంతోష్.. తాజాగా స్పెష‌ల్ ఫ్లైట్ లో దేశ రాజ‌ధానికి ప‌య‌న‌మైన వైనం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న‌విష‌యంలోకి వెళితే..

గురువారం ఉద‌యం వ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే ఉన్న టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్.. హ‌డావుడిగా ఢిల్లీకి స్పెష‌ల్ ఫ్లైట్ లో వెళ్లిన  వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. అప్ప‌టివ‌ర‌కూ రోటీన్ ప‌నుల్లో.. బాస్ కేసీఆర్ సేవ‌లో ఉన్న ఆయ‌న‌.. అక‌స్మాత్తుగా ప‌రుగులు పెడుతూ ఢిల్లీ ప‌య‌న‌మైన తీరుతో ఏం జ‌రిగింద‌న్న ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది.

ఢిల్లీకి అంత అర్జెంట్ గా ఎందుకు వెళ్లార‌న్న దానిపై తాజాగా స‌మాచారం బ‌య‌ట‌కొచ్చింది. ఢిల్లీ నుంచి కేంద్ర‌మంత్రి అమిత్ షా నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఫోన్ చేయ‌టం.. తాము రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన స‌మాచార హ‌క్కు స‌వ‌ర‌ణ‌ చ‌ట్టాన్ని ఆమోదించ‌టానికి అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లం లేక‌పోవ‌టంతో.. త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయాల‌ని కోరట‌మే కార‌ణంగా చెబుతున్నారు.

ఇప్ప‌టికే మోడీతో రాజీ చేసుకోవాల‌న్న ఎత్తుగ‌డ‌లో ఉన్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌లు మార్గాల్లో ప్ర‌య‌త్నించి అలిసిపోయారు. ఏమీ వ‌ర్క్ వుట్ కాని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. అమిత్ షా నుంచే స్వ‌యంగా ఫోన్ కాల్ రావటం.. సాయాన్ని కోర‌టం.. షా కోరిన సాయానికి సానుకూలంగా స్పందించారు.

పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం ద్వారా రాజ‌కీయంగా త‌మ‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌న్న విష‌యం కేసీఆర్ తెలిసిందే. అందుకే ఆయ‌న‌.. అప్ప‌టివ‌ర‌కూ వ్య‌తిరేకిస్తున్న  స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లుపై యూటర్న్ తిరిగారు.  సానుకూలంగా స్పందించేందుకు వీలుగా షాకు ఓకే చెప్పారు.అదే స‌మ‌యంలో ఓటింగ్ లో పాల్గొనేందుకు వీలుగా హైద‌రాబాద్ లో ఉన్న ఎంపీ సంతోష్ ను వెంట‌నే ఢిల్లీకి పంపుతాన‌ని చెప్పారు.

సీఎం త‌లుచుకుంటే స్పెష‌ల్ ఫ్లైట్స్ కొద‌వ ఉండ‌దు క‌దా. అందుకే.. సంతోష్ ఢిల్లీకి వెళ్ల‌టానికి వీలుగా  స్పెష‌ల్ ఫ్లైట్ ను సిద్ధం చేయించారు. బిగ్ బాస్ నోటి నుంచి ఢిల్లీకి వెళ్లాల‌న్న క్లారిటీ వ‌చ్చినంత‌నే సంతోష్ ఆగ‌మేఘాల మీద ఢిల్లీకి బ‌య‌లుదేరారు. దీంతో ఉద‌యం వ‌ర‌కూ హైద‌రాబాద్ లో ఉన్న సంతోష్.. గంట‌ల వ్య‌వ‌ధిలో ఢిల్లీలో ద‌ర్శ‌న‌మివ్వ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. షా కోరినంత‌నే స్పెష‌ల్ ఫ్లైట్ లో త‌న ఎంపీని పంప‌టం ద్వారా మోడీషాల మ‌న‌సుల్ని దోచుకునేందుకు కేసీఆర్ ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News