ఆ ఎంపీ గాడ్జెట్ ఎందుకు వాడుతున్నాడో ...?

Update: 2020-03-04 11:38 GMT
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ...ప్రస్తుతం సోషల్ మీడియా లో స్టార్ గా మారిపోయారు. దానికి కారణం అయన గత కొన్ని రోజులుగా ఉపయోగిస్తున్న గాడ్జెట్. అయన ఈ మధ్య కాలంలో ఆ గాడ్జెట్ లేకుండా బయటకి రావడంలేదు. ఇకపోతే , ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం అయన మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారారు. తాజాగా పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీ హేమమాలిని, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఎదో మాట్లాడుకుంటూ కనిపించారు. వారు ఏమి మాట్లాడుకుంటున్నారో ఏమో కానీ, మరోసారి మెడలో ఉన్న గాడ్జెట్ మాత్రం మరోసారి అందరి దృష్టిలో పడింది.

ఎంపీ  మెడలో ఉన్న ఆ గాడ్జెట్ ..చూడటానికి సెల్‌ ఫోన్‌ లా కనిపిస్తున్నప్పటికీ , అసలు అ గాడ్జెట్‌ ని ఎందకు ఉపయోగిస్తారో అందరికి తెలిసి ఉండకపోవచ్చు. దాని ఉపయోగం తెలిసినవారు సైలెంట్ గా ఉన్నప్పటికీ ..మరికొందరు మాత్రం ఆయన్నేఅడగ్గా ..దానికి అయన ఆ గాడ్జెట్ యొక్క ఉపయోగం ఏమిటో కూడా తెలిపారు. అసలు ఎంపీ మెడలో ఉన్న ఆ గాడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్. దీన్నే నెగటివ్ అయోనైజర్ అని కూడా కొంతమంది పిలుస్తారు. అలాగే , ఎయిర్ టేమర్ అని కూడా అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్సనల్ ఎయిర్‌ ప్యూరిఫయర్. అయితే, ప్రస్తుతం మనదేశంలో ఉన్న వాయుకాలుష్యం వల్ల ఈ ఎయిర్‌ ప్యూరిఫయర్ల వాడకం పెరిగింది.

అయితే, మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఈ ఎయిర్‌ ప్యూరిఫయర్లని తీసుకోని పోవడానికి కుదరదు కాబట్టి, వాటి స్థానాల్లో ఈ ఎయిర్ టేమర్ లని వినియోగిస్తున్నారు.ఈ ఎయిర్ టేమర్ లని అయితే , ఎక్కడికైనా వెంటపెట్టుకొని తీసుకుపోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు ..ఈ ఎయిర్ టేమర్ ల వాడకం కూడా బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం అధికంగా ఉండే ఆసియా దేశాల్లోని నాయకుల మెడల్లో ఇవి కనిపిస్తున్నాయి. వైరస్‌లు సోకకుండా ఇది కాపాడుతుందన్న ఉద్దేశంతోనూ వీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో దీని వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశాలు జరిగిన సమయంలోనే @MATTSMATTS అనే ఒక నెటిజన్ ట్విటర్ వేదికగా శశిథరూర్‌ ను దీని గురించి అడిగారు. మెడలో ఈ గాడ్జెట్ వేసుకున్న శశిథరూర్ ఫొటోను ట్వీట్ చేసి 'ఈ గాడ్జెట్ ఏమిటి థరూర్ గారూ' అంటూ అడగ్గా ...అది ఎయిర్ ప్యూరిఫయర్ అని అయన సమాధానం ఇచ్చారు. ఇకపోతే , ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో ..ఈ గాడ్జెట్ ల పై అందరి చూపు పడుతుంది. అయితే, ఈ గాడ్జెట్ కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా అన్న కోణంలో ఇంతవరకు వైద్యపరమైన అధ్యయనాలేమీ జరగలేదు.వైరస్, బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదని విక్రయ సంస్థ ఎయిర్‌టేమర్ చెబుతున్నప్పటికీ ఎలాంటి వైరస్‌లను అడ్డుకోగలదు.. ఏ స్థాయి వరకు అడ్డుకోగలదన్న విషయంలో మాత్రం స్పష్టతలేదు.


Tags:    

Similar News