ఎంపీలు మోడీ మాటే లెక్కచేయడం లేదే?

Update: 2020-01-03 10:52 GMT
2014 లో ప్రధాని గా నరేంద్ర మోడీ గద్దెనెక్కాక ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ‘సంసద్ ఆదర్స్ గ్రామ్ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ప్రతీ ఎంపీ తన నియోజక వర్గాలోని ఒక గ్రామాన్ని 2016 కల్లా ఎంపిక చేసి దత్తత తీసుకొని ఆదర్శం గా తీర్చిదిద్దాలని నిధులిస్తానని ప్రకటించారు. ఇక 2019 వరకూ ఒక్కో ఎంపీ 5 గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రకటించిన ఈ పథకాన్ని ఎంపీలు పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది.

లోక్ సభ ఎంపీల్లో మూడింట రెండు వంతుల మంది నాలుగోదశ కింద గ్రామపంచాయతీలను ఇంకా ఎంపిక చేసుకోలేదని తెలిసింది. మొదట మోడీ ప్రకటించగానే 703 మంది రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు స్పందించి మొదటి దశలో ఎంపిక చేసుకున్నారు. ఇక రెండోదశలో ఆ సంఖ్య 497కి పడిపోయింది. మూడో దశకు వచ్చేసరికి 301కి పడి పోయింది. నాలుగుదశల్లో కేవలం 1753 గ్రామాలను ఎంపిక చేసి అక్కడ అసలు పనులు ఏమీ చేపట్టలేదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ లో విచారణ లో తేలిందట..

నాలుగో దశలో కేవలం 252మంది ఎంపీలు మాత్రమే గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఇలా మోడీ సార్ చెప్పినా కూడా.. నిధులు ఇస్తానన్న మన ఎంపీలు గ్రామాల దత్తతను పూర్తిగా పక్కన పెట్టడం విశేషం.


Tags:    

Similar News