త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని, అన్ని స్థానాలూ అధికార పార్టీ గెలుచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు అన్నారు. రాపాక జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. కానీ.. కొంత కాలంగా అధికార పార్టీకి దగ్గరగా ఉంటున్నారు.
ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. సఖినేటి పల్లి మండలం మోరి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాపాక.
జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరాలని ఆయన సూచించారు. ఇందుకోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఈ ఫలితాల ద్వారా మన సత్తా ఏంటో చూపించాలని అన్నారు. కాగా.. కొత్త ఎన్నికల కమిషనర్ పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో.. పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. టీడీపీ మాత్రం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.