దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నరంటూ ధైర్యంగా బయటకు చెప్పిన మహిళా ఎమ్మార్వో వనజాక్షి గుర్తున్నారా? 2015లో ముసునూరు మండలంలో అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా చింతమనేని - ఆయన అనుచరులు వనజాక్షిపై దాడి చేశారు. కొందరైతే చంపేస్తామని బెదిరించారు కూడా. అయినా, ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో పోడారారు. అయితే, చివరకు ఎమ్మెల్యేదే పైచేయి అయింది. ఎమ్మార్వో వనజాక్షి అక్కడి నుంచి బదిలీ అయ్యారు.
తాజాగా చింతమనేని - జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో వనజాక్షి మరోసారి వార్తల్లోకెక్కారు. దెందులూరులో చింతమనేనిపై ఆమె పోటీ చేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై చేసిన పోరాటం - అనంతరం ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఎదురైన బెదిరింపులను ఖాతరు చేయకుండా వ్యవహరించిన తీరుతో అప్పట్లో వనజాక్షికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. మహిళా - దళిత సంఘాలు ఎమ్మార్వోకు మద్దతుగా నిలిచాయి.
దీంతో జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో వనజాక్షి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల దెందులూరులో పర్యటించిన పవన్.. చింతమనేనిపై దృఢమైన మహిళను బరిలో దించనున్నట్లు ప్రకటించారు కూడా. వనజాక్షిని దృష్టిలో పెట్టుకొనే ఆయన అలాంటి ప్రకటన చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ ఆమెతో మాట్లాడారనీ చెబుతున్నారు.
పవన్‌కు పశ్చిమ గోదావరిలో మంచి పట్టుంది. కాబట్టి అక్కడ అన్ని వనరులను సమకూర్చి వనజాక్షిని గెలింపించడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. దమ్ముంటే తనను దెందులూరులో ఓడించాలంటూ చింతమనేని ఇటీవల పవన్‌కు విసిరిన సవాల్‌ను కూడా గుర్తుచేస్తున్నారు. మహిళ చేతిలో ఓడిస్తే.. చింతమనేనికి సరైన గుణపాఠం చెప్పినట్లవుతుందని పవన్ భావిస్తుండొచ్చని విశ్లేషిస్తున్నారు.