ముద్రగడ ఇష్యూ శనివారం ఏమైంది?

Update: 2016-06-19 04:12 GMT
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం చేస్తున్న దీక్ష సంగతి తెలిసిందే. తుని విధ్వంసం ఉదంతంలో అరెస్ట్ చేసిన వారందరిని విడుదల చేయాలంటూ దీక్ష చేయటం.. ఆయన్ను బలవంతంగా రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచటం.. ఆసుపత్రిలోనే ఆయన దీక్ష చేస్తుండటం తెలిసిందే. ఆయన ఆరోగ్యం మరీ క్షిణించిన నేపథ్యంలో ఆయన సెలైన్లు పెట్టించుకోవటానికి ఓకే చెప్పటం లాంటివి ఘటనలుశుక్రవారం చోటు చేసుకున్నాయి. మరోవైపు ముద్రగడ చేత దీక్ష విరమించేలా చేయటం కోసం ఆయన డిమాండ్ ను తీర్చేందుకు అధికారులు హైరానా పడుతున్నారు.

తుని విధ్వంసం కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 10 మందికి బెయిల్ వచ్చింది. మిగిలిన వారికి శనివారం బెయిల్ వస్తుందని భావించినా రాలేదు. మరోవైపు బెయిల్ లభించిన పది మందిలో 8 మంది విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరిలో బెయిల్ పేపర్స్ సమర్పించని ఉదంతంలో పుల్లయ్యను విడుదల చేయలేదు. మరోవైపు కోటనందూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లగుడు శ్రీనుకు బెయిల్ లభించింది. అయితే.. అతన్ని సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అతను విడుదల కాలేదు. మిగిలిన వారి బెయిల్ కోసం అధికారులు కసరత్తు చేస్తుననారు.

ఇదిలా ఉండగా ముద్రగడతో పాటు ఆయన భార్య.. కుమారుడు.. కోడలు సైతం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారటం.. ముద్రగడ సతీమణి పద్మావతి కడుపునొప్పితో బాధ పడుతుండటంతో ఆమెకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఆమె ఇన్ ఫెక్షన్ కు గురయ్యారన్న విషయాన్ని గుర్తించిన వైద్యులు.. ఆమెను.. ముద్రగడ కుమారుడు గిరి.. కోడలు సిరిల ఆరోగ్యం మరీ దిగజారటంతో వైద్యుల సూచనతో వారు శనివారం రాత్రి 11 గంటల సమయంలో దీక్ష విరమించారు. వారికి మరింత మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు. మరోవైపు ముద్రగడ దీక్షను సైతం విరమించేందుకు వీలుగా.. మిగిలినవారికి బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
Tags:    

Similar News