మళ్లీ ముద్రగడ ఫైర్

Update: 2016-03-02 07:21 GMT
 కాపు నేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ ఉద్యమానికి సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పిన ఆయన కాపు కార్పొరేషన్ రుణాల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు తనను మోసగించారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరడం లేదని ఆరోపించారు. కాపు రుణాల పేరుతో పసుపు చొక్కాలకే ఇస్తున్నారని అన్నారు. కాపు గర్జన సభకు వచ్చిన వారిని కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని...  ఏ కులానికీ వ్యతిరేకం కానని చెబుతూ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితులు తీసుకువస్తున్నారని అన్నారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
   
కాగా ముద్రగడ గురువారం కాపు నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో చర్చించిన తరువాత ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. తన వెంట ఉంటే కేసుల తప్పవని ప్రభుత్వం యువతను బెదిరిస్తోందని... తాను వైసీపీకి అమ్ముడుపోయానని కూడా ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ముద్రగడ ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News