కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోమారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. తన వియ్యంకుడి రివాల్వర్ ను సరెండర్ చేయమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంపై ఆయన మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును విమర్శించారు. వేధింపులకు తానేం జడిసే రకం కాదని స్పష్టం చేశారు. తానేమీ ముఖ్యమంత్రి బావమరిది బాలకృష్ణ తరహాలో వియ్యంకుడి తుపాకీని ఉపయోగించేదిలేదని ఎద్దేవా చేశారు.
బాలకృష్ణ తన భార్య పేరిట ఉన్న రివాల్వర్ ను ఉపయోగించారని అయితే తానేమైనా వియ్యంకుడి ఆయుధాన్ని వాడుకున్నానా అంటూ ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. తన ఉద్యమానికి, తన వియ్యంకుడి రివాల్వర్ కు సంబంధమేంటంటూ ఆయన ప్రశ్నించారు. తనపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని ముద్రగడ పేర్కొన్నారు. రాజమండ్రిలో సమావేశానికి ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందన్నారు. తునిలో సభకు స్థలమిచ్చిన మిత్రుడిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. తమ మానవహక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని అయితే ఇలాంటి వేధింపులకు తాను జడిసే రకం కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానాల్ని వీడని పక్షంలో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. తాను మాత్రం ఇలాంటి ఉడత అరుపులకు భయపడి ఉద్యమాన్ని నిలిపేసే ప్రసక్తేలేదని ముద్రగడ పునరుద్ఘాటించారు.