తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ ఐదు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజా ఆరోగ్య పరిస్థితేమిటి? ఆయన దీక్షకు సంబంధించిన అప్ డేట్ ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయనకు సంబంధించిన వార్తలు టీవీల్లో కానీ.. పత్రికల్లో కానీ పెద్దగా రాని పరిస్థితి. ముద్రగడ ఆరోగ్యానికి సంబందించి తరచూ వార్తలు ఇచ్చే సాక్షి ప్రసారాలు ఆగిపోవటం.. మరో రెండు ఛానళ్ల విషయంలో తీవ్ర హెచ్చరికలు అందిన నేపథ్యంలో.. భావోద్వేగాలు పెరగనీయని రీతిలో వార్తలు వస్తున్నట్లుగా చెబుతున్నారు.
చివరకు సాక్షి మీడియా సంస్థ కూడా ముద్రగడ వార్తలకు సంబంధించి కాస్త జోరు తగ్గించినట్లుగా కనిపిస్తోంది. ఇక.. ముద్రగడ ఆరోగ్యం విషయానికి వస్తే.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని చెబుతున్నారు. మంచినీళ్లు కూడా తాగని ఆయన.. వైద్యులు పరీక్షలు చేసేందుకు సైతం అనుమతి ఇవ్వటం లేదు. దీంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి కచ్ఛితంగా ఎలా ఉందన్న విషయంపై వైద్యులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు.
షుగర్ సమస్య ఉన్న ముద్రగడ.. ఐదు రోజులుగా ఏమీ తీసుకోకుండా.. మొండిగా దీక్ష చేస్తున్నారు. ఎప్పటి మాదిరే సోమవారం కూడా ఆయన వైద్యులకు సహకరించటం లేదని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్ కిషోర్ వెల్లడించారు. ముద్రగడతో పాటు దీక్ష చేస్తున్న ఆయన భార్య.. కోడలు.. కుమారుడు మాత్రం వైద్యులకు సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ముద్రగడ కంటే వయసులో చిన్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ముద్రగడ పరిస్థితి మరెలా ఉన్నట్లు? ఆయనకు సంబంధించిన తాజా ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం తరచూ బులిటెన్లు విడుదల చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.