23 రోజులుగా అప్రకటిత గృహనిర్భందం...ఇంటి నుంచి అడుగుబయటపెట్టాలంటే భయం..అడుగు తీస్తే అడ్డుకోవడం...ఇది కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద పరిస్థితి. తన స్వగ్రామమైన కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర తలపెట్టిన కాపు ఉద్యమనేతను ఏపీ సర్కారు ఇలా రౌండప్ చేసేసింది. ఇంట్లో నుంచి బయటకు రావడం ఆలస్యం పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ తన ఉద్యమ పంథాను మార్చారు. ప్లాన్ బీతో ముందుకు సాగాలని నిర్ణయించారు. తనతో పాటు కాపు జేఏసీ నేతలను సైతం సంఘటితం చేశారు.
తాజాగా ముద్రగడ తన నివాసం నుంచి బైటకు రావడం ఆలస్యం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకున్న చోటే కుర్చీ వేసుకుని బైఠాయించారు. వెంట ఉన్న జేఏసీ - కాపు సంఘాల నాయకులతో అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ తనను గత 23 రోజులుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక తనకు సహనం లేదన్నారు. అడ్డుకుంటున్న పోలీసుల ద్వారా ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు చేసినా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను శుక్రవారం నుండి ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయిస్తానన్నారు. ఏ క్షణంలోనైనా తాను పోలీసుల హద్దులు దాటి పాదయాత్ర చేస్తానని స్పష్టంచేశారు. కాగా ముద్రగడ గేటు వద్దే బైఠాయించారన్న విషయం చాలామందికి తెలియడంతో జిల్లా నలుమూలల నుండి కాపు సంఘాల నేతలు భారీ సంఖ్యలో ముద్రగడ శిబిరానికి చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. తుని నియోజకవర్గం నుండి కాపు నాయకుడు నరిశే శివాజీ సారథ్యంలో సుమారు రెండు వేల మంది కాపు యువకులు ముద్రగడ శిబిరానికి వచ్చి ఆయనకు మద్దతు పలికారు. వారిలో చాలా మందిని పోలీసులు అడ్డుకుని అడ్రసులు - ఆధార్ నెంబర్లు తదితర వివరాలు సేకరించేందుకు ఉపక్రమించడంతో వాగ్వాదం జరిగింది.
మరోవైపు ప్రత్యేక కార్యాచరణగా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ అమలు చేయనుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు - మహిళలు - యువత కిర్లంపూడికి తరలివెళ్లనున్నారు. చలో అమరావతి పేరుతో ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం, అనధికారికంగా గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు - అక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ జిల్లాల వరకు ఈ ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లోని కాపు సామాజిక వర్గంకు చెందిన వారు ప్రతీ రోజు ఆయా నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ లు - రాస్తారొకోలు - ధర్నా వంటి తదితర కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్న ఒక్కో నియోజకవర్గం ఒక్కో రోజు కిర్లంపూడిలోని ముద్రగడను కలుస్తారు. ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ ప్రత్యేకంగా వారితో చర్చిస్తున్నారు. రెట్టింపు ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వానికి కాక పెట్టించేలా ఉద్యమం చేయనున్నారు.