ముద్రగడను పిలుస్తున్న వైసీపీ...పెద్దాయన ఫుల్ సైలెంట్...?

Update: 2023-07-10 09:00 GMT
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తున్నారా. ఆయన పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారా. ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ముద్రగడ పవన్ కళ్యాణ్ మధ్య గత నెలలో డైలాగ్ వార్ నడచింది. ముద్రగడ పవన్ కి రెండు లేఖలు రాశారు. పవన్ వైపు నుంచి మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య ఘాటు విమర్శలు చేశారు. కాపులను వైసీపీకి తాకట్టు పెట్టేందుకే ముద్రగడ పవన్ మీద కామెంట్స్ చేశారని కూడా నిందించారు.

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం మళ్ళీ సైలెంట్  అయ్యారు. ఆయన పవన్ని పిఠాపురం నుంచి పోటీ చేయమని సవాల్ చేశారు. తాను అక్కడ నుంచి పోటీకి దిగుతాను అని కూడా చెప్పుకొచ్చారు. అయితే దానికి జనసేన నుంచి రియాక్షన్ రాలేదు కానీ జోగయ్య ఫైర్ అయి ముద్రగడ మీద ఒక లెవెల్ లో విరుచుకుపడిపోయారు.

ఇక ముద్రగడ ఆ తరువాత మాత్రం ఎక్కడా మళ్లీ సౌండ్ చేయడంలేదు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తామంటే తప్పకుండా చేర్చుకుంటామని చెప్పారు. నిజానికి ఈ ప్రతిపాదనతోనే ఆయన కొన్ని రోజుల క్రితం ముద్రగడని కిర్లంపూడిలో ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలసి వచ్చారని ప్రచారం సాగింది.

అయితే ముద్రగడ నాడు ఏమి చెప్పారో తెలియదు కానీ వైసీపీలో ఆయన చేరుతారు అని కొంత కధ నడచింది. అయితే ఆ తరువాత కాకినాడ ఎంపీ వంగా గీత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముద్రగడని కలసి వచ్చారు ఇక రేపో మాపో పెద్దాయన వైసీపీ తీర్ధం తీసుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇంతలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఇండైరెక్ట్ కామెంట్స్ తో ముద్రగడ బరస్ట్ కావడం పవన్ మీద హాట్ కామెంట్స్ చేయడంతో వాతావరణం వేడెక్కింది.

మొత్తానికి ముద్రగడను వైసీపీ మనిషిగా జనసేన నాయకులు చేసి పారేశారు. ఈ మొత్తం వ్యవహారంతో బాగా ఫీల్ అయిన పెద్దాయన చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. ఆయనకు రాజకీయంగా తిరిగి రావాలని ఉందో లేదో కూడా తెలియదు కానీ వైసీపీ మనిషిని అనిపించుకోవడం అది కూడా కాపుల ప్రయోజనాలకు తాకట్టు పెట్టారు అని అనిపించుకోవడం ఇష్టం లేదా అన్న చర్చ వస్తోంది.

ఇంకో అవిపు చూస్తే ఎంటీయార్ హయాంలోనే పదవులు వద్దు అంటూ ఒక దండం పెట్టి మంత్రి గిరీకి రాజీనామా ఇచ్చేసి వచ్చిన ముద్రగడ ఎపుడూ ఆత్మగౌరవం కోసమే చూస్తారని అంటున్నారు. ఇక ఇపుడు ముద్రగడ విషయంలో కొన్ని విషయాలు క్లియర్ అయ్యాయని అంటున్నారు. ఆయన వైసీపీలో చేరినా చేరకపోయినా జనసేన, టీడీపీకి యాంటీ అన్నది ఓపెన్ అయిపోయింది. ఆయన ముసుగు ఆ విధంగా లాగామని జనసేన టీడీపీ భావిస్తున్నాయి.

ఇక వైసీపీలో ముద్రగడ చేరకపోయినా పవన్ ముద్రగడ ఎపిసోడ్ తో ముద్రగడ వర్గం కచ్చితంగా జనసేనకు టీడీపీ యాంటీ అయిందని, ఆ వర్గం వైసీపీ వైపే ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక ముద్రగడ పట్టుదల కల మనిషి ఆయా ఏ పార్టీకి ఇమడని నేత. అలాంటి ఆయన వైసీపీలోకి వస్తే చేర్చుకోవడానికి వైసీపీ ఓకే . కానీ ఆయన రాకపోయినా ఇపుడు మారిన రాజకీయ నేపధ్యంలో ఫరవాలేదు అన్నట్లుగా ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ముద్రగడ చేతిలోనే బంతి ఉంది. ఆయన రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే వైసీపీ చేర్చుకుంటుంది. కానీ ఆయన మౌన ముద్రలో ఉన్నారు. ఎన్నికల వేళకు ఏమైనా సౌండ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Similar News