దేశంలో ముకేశ్ కు మాత్రమే సాధ్యమయ్యే రికార్డు ఇది

Update: 2019-11-28 14:30 GMT
భారతదేశంలో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మరో ఘనతను సాధించారు. దేశంలో ఇప్పటివరకూ ఎవరూ చేయని రీతిలో ఆయన కంపెనీ చరిత్రను క్రియేట్ చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో అతి పెద్ద కంపెనీగా నిలిచింది. దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా అవతరించింది.

ప్రపంచంలో అతి పెద్ద ఆరో ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్.. ఎలైట్ క్లబ్ తో చేరింది. తాజాగా ఆ కంపెనీ షేర్ ధర ఒక్కొక్కటి రూ.1581.25కు చేరుకుంది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లను దాటి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచంలోన మార్కెట్ క్యాపిటలైజేషన్ లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ బీపీని వెనక్కి నెట్టి రిలయన్స్ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. రిలయన్స్ జోరు చూస్తే రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని రికార్డులు ముకేశ్ మాష్టారు క్రియేట్ చేస్తారో?


Tags:    

Similar News