చ‌రిత్ర సృష్టించిన రిల‌య‌న్స్ జియో..!!

Update: 2019-08-12 07:41 GMT
రిల‌య‌న్స్ జియో. నిన్న మొన్న‌టి వ‌రకు ఉన్న మొబైల్ ప్ర‌పంచాన్ని పెను కుదుపున‌కు గురి - సంచ‌ల‌నాలు సృష్టించిన సంస్థ‌. అర‌చేతిలో స‌మ‌స్థ విశ్వాన్ని ట‌చ్ చేయ‌డంతోనే చూపించిన ఈ అతిభారీ సంస్థ గ‌డిచిన ఏడాదిలో చ‌రిత్ర సృష్టించింది. రిటైల్ రంగంలో ల‌క్షా 30 వేల కోట్ల బిజినెస్ చేసి.. త‌మ‌కు సాటి - పోటీ లేనేలేద‌ని నిరూపించుకుంది. తాజాగా ఇదే విష‌యాన్ని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్ల‌డించారు. సోమవారం ఆయ‌న షేర్ హోల్డర్స్ సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించి చరిత్ర సృష్టించిన‌ట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకమ‌ని వెల్ల‌డించారు.

అంతేకాదు, 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. రిలయన్స్ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటినట్లు తెలిపారు. రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినేస్ చేశామని - సౌదీకి చెందిన‌ ఆరామ్‌కోతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ఇక‌, త‌న బిజినెస్‌ లో వ్య‌వ‌హారాలు - భ‌విష్య‌త్ వ్యూహాల‌ను కూడా ఈసంద‌ర్భంగా ఆయ‌న వివ‌రించారు. థియేటర్లో సినిమా రిలీజైన రోజునే మీ ఇంట్లోనే చూసే సేవలు 2020న అందుబాటులోకి రానున్నట్లు ముఖష్ అంబానీ ప్రకటించారు.

జియో ఫైబర్ ప్రీమియం సర్వీస్‌ లను ప్రారంభించ‌నున్నారు. సినిమాలు విడుదలైన రోజునే ఇంట్లోనే కూర్చుని అదే సినిమాను వీక్షించే సౌక‌ర్యం వ‌స్తుంద‌ని చెప్పారు.  జియో ఫైబర్ సబ్‌ స్క్రైబర్స్‌ కు ఇంటి నుంచి వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితమ‌ని వెల్ల‌డించారు. జియో ఫైబర్ ప్లాన్ ధర నెలకు రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉంటుంద‌ని - మోస్ట్ బేసిక్ ప్లాన్ 100 Mbps నుంచి ప్రారంభమవుతుంద‌ని, 1Gbps వరకు ఉంటుంద‌ని ముఖేష్ వివ‌రించారు.  ఎంఆర్ హెడ్ సెట్స్ డెవలప్‌ను ఉధ్దేశించి అంబానీ మాట్లాడుతూ.. ఇది యంగ్ ఇండియా పవర్ అని కితాబిచ్చారు. సరికొత్త ఎంఆర్ (మిక్స్‌ డ్ రియాలిటీ) హెడ్ సెట్స్ ఓ స్టార్టప్ డెలవప్ చేసింద‌ని, ఇందులో జియో పెట్టుబడి పెట్టింద‌ని, ఇది త్వరలో మార్కెట్లోకి రానుంద‌ని తెలిపారు.

1,600 పట్టణాల్లో - 20 మిలియన్ల మందికి బ్రాడ్ బాండ్ కనెక్షన్లు ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వివ‌రించారు. జియో గిగా ఫైబర్ ద్వారా త్వరలో 20 మిలియన్ల ఇళ్లకు సేవలు అందిస్తామ‌న్నారు. రిలయన్స్ జియోలో ప్రతి నెల 10 మిలియన్ల మంది భాగస్వాములు అవుతున్నారని - సౌదీ ఆరామ్‌ కోతో ఒప్పందం అనంతరం రిలయన్స్ రిఫైనరీస్‌ కు ఆ కంపెనీ రోజుకు 5,00,000 బ్యారెల్స్ క్రూడాయిల్‌ ను సరఫరా చేస్తుంద‌ని వివ‌రించారు.  రిలయన్స్ తన ఫ్యూయల్ రిటైల్ వ్యాపారంలోని 49 శాతం వాటాలను BPకి విక్రయించడం ద్వారా రూ.7,000 కోట్లు రాబడుతుంద‌ని తెలిపారు.  జియోను ఆదరించిన భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

ఎంఆర్ హెడ్ సెట్స్ పైన అంబానీ డెమో ఇచ్చారు. జియో కోసం వినియోగించిన ఫైబర్ ఎంత అంటే 11సార్లు భూమిని చుట్టేంతగా ఉంద‌ని వివ‌రించారు.  జియో సెటప్ బాక్స్ గేమింగ్స్‌ను సపోర్ట్ చేస్తాయి.  రిల‌య‌న్స్ సీఈవో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్‌ లపై వేలాది రూపాయలు ఖర్చు చేయడం ఇక హిస్టరీ కానుందని చెప్పారు. జియో బ్రాడ్ బాండ్ స్పీడ్ 100 Mbps నుండి ప్రారంభమవుతుంది. 1Gbps వరకు ఉంటుంద‌న్నారు.  చిన్న - మధ్య తరహా వ్యాపారాలకు బ్రాడ్ బాండ్ సేవల విస్తరణ ద్వారా చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఐవోటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామ‌న్నారు. 

హోమ్ బ్రాడ్ బాండ్ - అల్ట్రా హై ఇంటర్నెట్ - యూహెచ్‌ డీ సెటాప్ బాక్స్ స‌హా ఒకే కనెక్షన్‌ తో ఇంటర్నెట్ - డీజీహెచ్ సేవలు పొందే చాన్స్ ఉంద‌ని చెప్పారు.  జిగా ఫైబర్ రోలౌట్ రానున్న 12 నెలల్లో పూర్తి చేయ‌నున్న‌ట్టు ఆకాశ్ తెలిపారు. సెప్టెంబర్ 2019న జియో భైపర్ సేవల కమర్షియల్ లాంచ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. భారత్ మొత్తానికి ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.  ప్రతి ఇంటికి - ఎంటర్‌ ప్రైస్‌ కు - ఎస్ ఎంఈలకు బ్రాడ్ బాండ్ లక్ష్యంగా దూసుకుపోతామ‌న్నారు.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండియా అతిపెద్ద ఎగుమతిదారుగా పేర్కొన్నారు.  రిటైల్ రంగంలోని ఇతర అన్ని కంపెనీలతో పోల్చినా రిలయన్స్ రిటైల్ అతి పెద్దద‌ని వివ‌రించారు. 


Tags:    

Similar News