డేంజర్ జోన్లోకి ముంబై.. ఆ విషయంలో ఢిల్లీనీ వెనక్కి నెట్టింది..!

Update: 2022-12-09 09:30 GMT
భారత్ లో వాయి కాలుష్య నగరాల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు శబ్ద కాలుష్యం.. వాయు కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. భారత్ లో కర్బన ఉద్ఘారాల ఫ్యాక్టరీలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటం కూడా వాయు కాలుష్యానికి కారణమవుతోంది.

మారుతున్న వాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అనేక మంది శ్వాస కోస వ్యాధులతో బాధపడుతూ నిత్యం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పొల్యూషన్ ను కంట్రోల్ చేయాల్సిన పొల్యూషన్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనదేశంలో అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ పేరు వినిపించేది. ఢిల్లీ సర్కారు కొన్ని చర్యలు పట్టడంతో కొన్ని రోజులు వాయి కాలుష్యం తగ్గింది. అయితే పంజాబ్లో వరికుప్పలు తగలేయడం వంటి చర్యలతో ఢిల్లీలో మళ్లీ వాయి కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని స్కూళ్లకు ఇటీవల సెలవులు ప్రకటించడంతో మళ్లీ రోటేషన్ పద్ధతిలో వాహనాలను రోడ్లపైకి అనుమతి ఇస్తున్నారు.

పిల్లలు జిమ్.. పార్కులు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆదేశాలు చేశారు. ఢిల్లీ సర్కారు వాయి కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవడంతో ఢిల్లీలో పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే తాజాగా వాయు కాలుష్యంలో ఢిల్లీ నగరానికి ముంబై వెనక్కి నెట్టిందని అధికారులు ప్రకటించడం శోచనీయంగా మారింది.

ముంబైలో గురువారం నాడు వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని వెల్లడించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 315 పాయింట్లు నమోదు చేసింది. దీంతో వైద్యాధికారులకు ప్రజలు పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలు మాస్కులు లేకుండా రోడ్లపైకి రావద్దని.. ఆస్తమా వంటి వ్యాధులు కలిగిన వారు.. చిన్నపిల్లలు ఇన్ హేలర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుత శీతాకాలంలో వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు.. దగ్గు బారిన రోగులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఆస్తమా.. గుండె సంబంధిత రోగులు ఖచ్చితంగా 95, కే 95 మాస్కులు ధరించాలని.. గాలి నాణ్యత తక్కువ ఉన్నప్పుడే బయటి రావాలని సూచిస్తున్నారు. వాయు కాలుష్యంలో ఢిల్లీ.. ముంబై నగరాలు పోటీ పడుతుండటం రాబోయే రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బందులు పడాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News