ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ హత్యకు గురైన అనూహ్య కేసులో ఎట్టకేలకు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు అయ్యింది. కింది కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్ధిస్తూ గురువారం ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని అతి కిరాతకంగా చంపిన నిందితుడిపై ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.. మహిళలపై ఇలాంటి దాడులకు ఉరి సరైందని పేర్కొంది. ముంబై కోర్టు ఉరిశిక్షను సమర్ధించగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్య తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేరు అనూహ్య (22) ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. 2013 డిసెంబర్ లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు మచిలీపట్నం వచ్చి కుటుంబంతో సరదాగా గడిపింది. 2014 జనవరి 5న ఉద్యోగ రీత్యా ముంబైకి వెళుతుండగా.. మిస్ అయ్యింది. తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అనూహ్య కాలి పోయిన మృతదేహం జనవరి 16న ముంబై-ఫుణె హైవే పక్కన ఉన్న ముళ్లపొదల్లో లభ్యమైంది.
అనూష హత్యకేసులో ముంబై పోలీసులకు సీసీ ఫుటేజీ కీలక ఆధారంగా కనిపించింది. అనూషతో అనుమానాస్పదంగా తిరిగిన ఓ వ్యక్తి ఆచూకీ బయటపడింది. దర్యాప్తు చేయగా.. ముంబైకి చెందిన పాత నేరస్థుడు చంద్రభాను సనాప్ అని తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ కేసు విచారణ జాప్యం కావడంతో అనూష తండ్రి కేంద్రహోంమంత్రిని కలిసి విచారణ వేగవంతానికి ఆదేశించారు. దీంతో పోలీసులు డిసెంబర్ 2015లో హంతకుడిగా చంద్రభాను సనాప్ ను పక్కా సాక్ష్యాధారాలతో నిరూపించారు. అప్పుడు కిందికోర్టు ఉరిశిక్ష విధించగా.. నిందితుడు హైకోర్టు కెళ్లాడు. అక్కడా కూడా ఉరిశిక్ష ఖాయమైంది.