‘కర్ఫ్యూ’ అంటూ మా జీవితాలతో ఆడుకోకండి.. ముంబై వ్యాపారుల ఆవేదన..!

Update: 2020-12-24 15:30 GMT
బ్రిటన్​లో కొంత స్ట్రెయిన్​ కరోనా వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ లాక్​డౌన్​ విధించారు. క్రిస్మస్​ పండగను కేవలం ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఎయిర్​పోర్టులు, విదేశీ ప్రయాణాలు కూడా రద్దయ్యాయి. అయితే బ్రిటన్​ స్ట్రెయిన్​పై భారత్​లోనూ ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల యూకే నుంచి ఇండియాకు ఎవరెవరు వచ్చారంటూ వివిధ రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ముందుగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక అలర్టయ్యాయి. అయితే మహారాష్ట్రలో జనవరి 5 వరకు రాత్రి పూట కర్ప్యూ విధించినున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యాపారాలు తప్పుబడుతున్నారు.

కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని.. ఇప్పుడు మళ్లీ కర్ప్యూ అంటే తాము రోడ్డున పడతామని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ముంబైలో ప్రస్తుతం రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణే నగరాల్లో కలిపి 15 వేలమంది వ్యాపారులు రోడ్ల మీద చిన్న చిన్న బండ్లలో తినుబండారాలు అమ్ముతుంటారు. మరో 10 వేలకు పైగా హోటళ్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరి బిజినెస్​ ఎంతో దెబ్బతిననున్నది. డిసెంబర్​ 31న వీళ్ల వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం సరికాదని వ్యాపారులు అంటున్నారు.

సాధారణంగా ముంబై, పుణే లాంటి నగరాల్లో సాఫ్ట్​వేర్​ ఇతర రంగాల ఉద్యోగులు విధులు ముగించుకున్నాక.. అంటే రాత్రివేళలో ఎక్కువగా బయట తింటారు. ఈ క్రమంలో బిజినెస్​లో తీవ్ర నష్టం వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే పర్యాటకులు లేక దందా సరిగ్గా నడవడం లేదని.. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించడం సరికాదని వాళ్లు అంటున్నారు. అయితే బ్రిటన్​లో వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కర్ఫ్యూ తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News