ఏపీలో ఎన్నికల కోలాహలం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఎస్ ఈసి మరో ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
వివరాల్లోకి వెళ్తే .. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. మార్చి 10వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
అలాగే అదే రోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికలు మాములుగా అయితే, గత ఏడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020, మార్చి 14 వ తేదీ వరకు నామినేషన్లు కూడా స్వీకరించారు. 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించిన ఈసీ.. అదే రోజు మధ్యాహ్నం.. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నామని, తిరిగి దీనిపై మరో ప్రకటన వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయబడుతుందని ఈసీ ప్రకటించింది. ఎన్నికలు వాయిదా పడేనాటికి 12 మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డులకు 6,563 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 75 మున్సిపాలిటీల్లోని వార్డులకు 12, 086 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆ ప్రక్రియను ఇప్పుడు కొనసాగిస్తూ ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.