నేషనల్ హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చిన గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు మున్నాతో సహా 18 మందికి సోమవారం ఒంగోలు 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి మనోహర్ రెడ్డి శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రావడం వెనుక కానిస్టేబుళ్లు వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ కృషి ప్రశంసనీయం. మున్నా గ్యాంగ్ కు శిక్ష పడిందని తెలియగానే బాధిత కుటుంబాలతో పాటుగా ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైరైన అధికారులు, పలువురు న్యాయవాదులు శీను ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తారు. 2002 నుంచి 2014 వరకు ఆంధ్రా, తెలంగాణలో ఈ ముఠా అడ్డూ, అదుపు లేకుండాపోయింది. 17మంది ముఠాగా ఏర్పడి దోపిడీలు చేస్తూ ఆపై హత్యలకు పాల్పడుతూ దారుణ మారణకాండ సాగించారు.
ఇంత నేరచరిత్ర కలిగిన మున్నా ముఠాపై రెండు రాష్ట్రాల్లో 22 కేసులు నమోదు అయ్యాయి. 14 కేసులు ప్రకాశం జిల్లాలో నమోదు కావడం గమనార్హం. మిగిలిన 9 కేసులు గుంటూరు జిల్లాలో మూడు కడపలో 2, నల్గొండ, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు కాగా 8 కేసుల్లో ఇప్పటికే తీర్పులొచ్చాయి. అయితే ఒంగోలులో సోమవారం 8వ అదనపు న్యాయమూర్తి జి.మనోహరరెడ్డి నాలుగు కేసుల్లో సంచలనమైన తీర్పు ఇచ్చి 12మందికి ఉరిశిక్ష, నలుగురికి జీవిత ఖైదు, ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఇంకా ఈ ముఠాపై జిల్లాలోనే మూడు కేసులు విచారణలో ఉన్నాయి.
ఇకపోతే , మంగళవారం నెల్లూరు నగరంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో అదనపు ఎస్పీ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసు తీరుతెన్నులు, అధికారులు పడిన కష్టాలను వివరించారు. 2008 అక్టోబరు 17న తమిళనాడుకు చెందిన వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసు ఎన్నో మలుపులు తిరిగిందన్నారు. 2010లో కేసును ఏపీ సీఐడీకు బదిలీ చేశారు. ఆనాటి సీఐడీ డీఎస్పీ కె.రఘు ఈ కేసుల ఛార్జిషీటును దాఖలు చేసి దర్యాప్తు నిర్వహించారు. కేసు విచారణలో భాగంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి కీలకమైన సాక్ష్యాలు సేకరించారు. మున్నా ముఠాపై ఉన్న కేసుల్లో కీలక సాక్ష్యాధారాలు కోర్టుకు అందించడంతో పాటు కేసుల్లో పోలీసుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం 2010లో ప్రత్యేకంగా ఇరువురు కానిస్టేబుళ్లను నియమించారు. వారిరువురు తన కుటుంబ అవసరాలను కూడా పక్కనబెట్టి ఆధారాల సేకరణ కోసం పనిచేశారు. సోమవారం మధ్యాహ్నం మున్నా ముఠాకు శిక్షలు ఖరారైనట్లు తెలుసుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను తన చాంబర్‌కు పిలిపించుకుని అభినందించారు