దేశంలోనే ఖరీదైన ఉప పోరుగా చెబుతున్న మునుగోడు ఉప పోరు ఎన్నికల ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఫలితం వచ్చినా.. అధికార టీఆర్ఎస్ కు మాత్రం సంతృప్తికరంగా లేదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. అధికార టీఆర్ఎస్ కు కేవలం పది వేల మెజార్టీ మాత్రమే లభించటం. కిందా మీదా పడి.. మంది మార్బలాన్ని దింపిన ఈ ఉప పోరులో భారీ మెజార్టీని ఆశించిన గులాబీ దళానికి.. అతి తక్కువ మెజార్టీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికలో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురుదెబ్బ తప్పలేదు. కాకుంటే.. పార్టీ మారి.. తనతో పాటు క్యాడర్ రాకుండా ఉన్న వేళలో.. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి.. మానిటర్ చేయటమే కాదు..మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు.. తమ బలగాలు మొత్తాన్ని దింపిన తర్వాత కూడా మెజార్టీ పది వేలకే పరిమితం కావటం అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. ఇక.. ఈ ఎన్నికల్లో భారీ ఖర్చు తప్పలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఈ ఉప పోరు ఖర్చును మదింపు చేసింది ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్.
ఈ ఉప పోరుకు ముందు అన్ని పార్టీలు కలిపి ఒక్కో ఓటుకు రూ.30వేల వరకు ఖర్చు చేస్తాయని అంచనా వేశారు. సరాసరిన రెండు లక్షల ఓట్లకు దగ్గర దగ్గర రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే.. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంచనాల ప్రకారం మనుగుడు ఉప ఫోరు కోసం అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ.627 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఓటుకు సగటున రూ.9వేల చొప్పున ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
మొత్తం ఓటర్లలో 75 శాతం ఓటర్లకు సొమ్ములు అందినట్లుగా లెక్కలు వేశారు. టీఆర్ఎస్ తమకు రూ.5వేలుఇచ్చిందని.. బీజేపీ రూ.4 వేలు చొప్పున ఇచ్చిందని పలు యూట్యూబ్ చానళ్లకు ఓటర్లు చెప్పటం తెలిసిందే. మొత్తంఓటర్లలో 75 శాతానికి పైగా ఓటర్లకు డబ్బులు అందినట్లుగా చెబుతున్నారు. ఇక.. కాంగ్రెస్ అభ్యర్థి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు మాత్రమే పంపిణీ చేశారని.. అది కూడా తక్కువ మందికి మాత్రమే పంపిణీ చేశారని చెబుతున్నారు. ఇది కాకుండా.. మద్యం ఏరులై పారటం.. చికెన్.. మటన్ పెద్ద ఎత్తున పంపిణీ చేయటం తెలిసిందే.
ఇవి కాకుండా పార్టీలు నిర్వహించిన ర్యాలీలు.. సమావేశాల ఏర్పాటుతోపాటు పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా మొత్తం కలిపి రూ.627 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా ఈ సంస్థ చెబుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. మరో రూ.200 కోట్ల వరకు ఖర్చుఅయినట్లుగా చెబుతున్నారు. సంస్థ అంచనా ప్రకారం చూస్తే రూ.627 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పినా.. అనధికారిక లెక్కల ప్రకారం రూ.800 కోట్లకు పైనే ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత భారీగా ఖర్చు చేశారా? అని ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు.. నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.